పరిస్థితి అర్ధం చేసుకోండి..ఇంట్లో ఉండండి: జర్నలిస్ట్ లకు రాజేష్ బాబు హితవు

అన్నలారా..
తోటి పాత్రికేయ మిత్రులారా...


ఇంత కాలం లేనిది ఇప్పుడు కొత్తగా నోకొవ్చే కిరీటం ఎవరూ పెట్టరు...ముళ్లున్న కరోనా నైతే మాత్రం అంటిస్తారు...నిన్ననే విన్నాం ముంబై, చెన్నై లలో జర్నలిస్టులకు కోవిద్ పాజిటివ్ అని, అంతలోనే మహబూబ్ నగర్ లో మన వాళ్లు ప్రస్తుతానికి క్వరంటైన్ లో వున్నారు.
 ఒక్క సారి ఆలోచించండి...
సరే వృత్తి లో భాగమే కదా భయమెందుకు అని నువ్వనుకున్నా నీకు భరోసా ఎవరు? ఎవరూ లేరు! రారు! 
కనీసం డ్రైవర్లు, క్లీనర్లు, కూలీ బతుకులకున్న విలువ నీకు లేదు...అర్థమౌతుందా??? మిత్రులారా...మనం పరుగెత్తి పరుగెత్తి సేకరించే సమాచారం కావాలని ఎవరూ అడగడం లేదు....ప్రభుత్వం చెప్పే లెక్కే ఫైనల్... తప్పడు వార్త అయితే కేసు, చొచ్చుకుపోతే కరోనా వైరస్సు.


...అవసరమా!!


!ఇంత చెప్పినా వినకపోతే అది ....


నిజంగా ఖర్మే....
ఇంట్లోనే వుండండి...
వార్త అవసమనుకున్న వారు సమాచారం పంపిస్తే రాయండి...


వాళ్లకంటే ముందే మీరెళ్లి, కరోనాకు భారిన పడితే ఏ యాజమాన్యం, ఏ ప్రభుత్వం పట్టించుకోదు..మీకు వచ్చిన కరోన కుటుంబ సభ్యులకు రావడం ఖాయం...పరిస్థితి అర్ధం చేసుకోండి..ఇంట్లో ఉండండి...ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి ..ఖచ్చితంగా మా వంతు సహకారం ఉంటుంది


         మీ
రాజేష్ బాబు