జర్నలిస్టుల తొలగింపుపై రిట్‌ పిటీషన్‌ విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు


––––––––––––––––––––––––––––––––––
జర్నలిస్టుల తొలగింపుపై రిట్‌ పిటీషన్‌
విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
––––––––––––––––––––––––––––––––––––
        హైదరాబాద్, ఏప్రిల్ 27 :    లాక్‌డౌన్‌ సంక్షోభం సాకుతో జర్నలిస్టులను తొలగించకుండా ఆయా మీడియా సంస్థల యాజమాన్యాలను ఆదేశించాలని కోరుతూ ఎన్‌ఏజే, డీయూజే, ముంబై జర్నలిస్టుల యూనియన్, ఏపీడబ్ల్యూజేఎఫ్‌ దాఖలు చేసిన రిట్‌ పిటీషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు సోమవారం విచారణకు స్వీకరించింది. జస్టిస్‌ ఎన్‌వీ రమణ, సంజయ్‌ కిషన్‌ కౌల్, బీఆర్‌ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరిస్తూ రెండు వారాల్లోగా సమాధానాన్ని ఇవ్వాల్సిందిగా ప్రతివాదులుగా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, ఇండియన్‌ న్యూస్‌ పేపర్‌ సొసైటీ, న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌ను ఆదేశించింది. లాక్‌డౌన్‌ సాకుతో దేశంలోని వివిధ పత్రికల, ఎలక్ట్రానిక్‌ మీడియా సంస్థల యాజమాన్యాలు జర్నలిస్టులతో సహా పలు విభాగాల సిబ్బందిని తీసివేయడమో, బలవంతంగా రాజీనామా చేయించడమో, వేతనాల్లో కోత విధించడమో, సెలవులపై వెళ్లేలా చేయడమో చేస్తున్నాయని ఫిర్యాదుదారులుగా ఉన్న నేషనల్‌ అలియెన్స్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ (ఎన్‌ఏజే), ఢిల్లీ జర్నలిస్టుల యూనియన్‌ (డీయూజే) తదితర సంఘాల నాయకులు ఎస్‌కే పాండే, ఎన్‌.కొండయ్య, సుజాతా ముధోక్, ఇంద్ర కుమార్‌ జైన్, జి. ఆంజనేయులుు తమ పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈ పరిస్థితిని ఆపేలా ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంను కోరారు. పిటీషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది కోలిన్‌ గన్సెల్వస్‌ హాజరయ్యారు. సాలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ పిటీషన్‌ ప్రతిని తనకు అందజేయాల్సిందిగా ధర్మాసనాన్ని కోరారు. 
––––––––––––
జి. ఆంజనేయులు ప్రధాన కార్యదర్శి, ఏపీడబ్య్లుజేఎఫ్, ఏ.అమరయ్య, కె. మునిరాజు కన్వీనర్‌, ఎపీబీజేఏ, శాంతి శ్రీ, కార్యదర్శి ఎన్ ఎ జే,
ఎన్‌.కొండయ్య, ప్రధాన కార్యదర్శి, ఎన్‌ఏజే
హైదరాబాద్, 
తేదీ 27–04–2019