తేది:13-04-2020
నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లిగూడూరు మండలం లో ప్రజలకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్న కూరగాయలను పరిశీలించి, పంపిణీ చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి.
.నియోజకవర్గంలో ప్రతిరోజు సరాసరిన 15 నుండి 20 టన్నుల కూరగాయలను ప్రాంతాలవారీగా పంపిణీ చేస్తున్నాం.. బయట జిల్లాల నుండి బయట రాష్ట్రాల నుండి ఎక్కడ కూరగాయలు అందుబాటులో ఉంటే, అక్కడ కొనుగోలు చేసి, ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం..లాక్ డౌన్ నేపథ్యంలో రోజులు గడుస్తున్న కొద్ది, అందుబాటులో ఉన్న కూరగాయల తోటల నుండి సేకరిస్తున్న కూరగాయలు ప్రజలకు సరిపోవటం లేదు..సర్వేపల్లి నియోజకవర్గంలో కూరగాయలు, నిత్యావసర సరుకులతో పాటు బియ్యం, వంటనూనెను అందిస్తున్నాం..లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి అవసరాలు తీర్చడానికి నిరంతరం కృషి చేస్తాము..సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.