సీ.ఎం. జగన్ జర్నలిస్టులను ఆదుకోవాలి : మచ్చా రామలింగారెడ్డి జాతీయ సభ్యులు (IJU) డిమాండ్.

 సీ.ఎం. జగన్ జర్నలిస్టులను ఆదుకోవాలి..


గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్, ప్రధాని మోడీతో మాట్లాడి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి.


మచ్చా రామలింగారెడ్డి జాతీయ సభ్యులు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) డిమాండ్.
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼


✍అనంతపురంలో 2వ రోజు కొనసాగిన జర్నలిస్టుల నిరసన దీక్ష..
______________________________


👉ఏ.పీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ నందు జర్నలిస్టుల సమస్యల సాధన కోసం మచ్చా రామలింగారెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు 2వ రోజు నిరసన దీక్ష కొనసాగింది.


✍మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి జర్నలిస్టులు కరోనా వార్తలు సేకరిస్తారని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కేంద్రంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ ఒత్తిడి తెచ్చి జర్నలిస్టులకు న్యాయం చేయాలని మచ్చా రామలింగారెడ్డి డిమాండ్ చేశారు.


✍జర్నలిస్టులకు 50 లక్షల ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్  బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని, జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని, జర్నలిస్టులకు పి.పి.ఈ కిట్లు, మాస్కులు అందజేయాలని కరోనా సహాయ నిధి కింద జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 5 వేల రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.


✍ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి  జర్నలిస్టుల సమస్యలపై దృష్టి సాధించాలని జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని అందరినీ ఆదుకుంటున్న సీ.ఎం జర్నలిస్టులను ఆదుకోవాలని మచ్చా రామలింగారెడ్డి డిమాండ్ చేశారు.


👉2వ రోజు నిరసన దీక్షలో సీనియర్ జర్నలిస్టు వార్త ఇంచార్జ్ జోగేశ్వర్ రెడ్డి, ఇండియన్ ఎక్స్ప్రెస్ స్టాఫ్ రిపోర్టర్ వేణుగోపాల్, సీనియర్ ఫోటోగ్రాఫర్ మారుతి, భాస్కర్ రెడ్డి, సొసైటీ కార్యదర్శి విజయరాజు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ శివ ప్రసాద్, సభ్యులు ఆది, దిలీప్, హనుమంత్ రెడ్డి, సాక్షి బాలు, ఆంధ్రజ్యోతి వాలి... జర్నలిస్టులు పెద్ద ఎత్తున దీక్షలో కూర్చున్నారు.


✍వార్త బ్యూరో ఇంచార్జ్ జోగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఈ పోరాటం జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమైయంత వరకు కొనసాగించాలని సూచించారు.. ఇండియన్ ఎక్స్ప్రెస్  వేణుగోపాల్ మాట్లాడుతూ జర్నలిస్టులు అందరూ ఐకమత్యంతో నిరసన దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


💎A.P. JOURNALIST DEVELOPMENT SOCIETY💎


Popular posts
*కలిగిరి కార్యదర్శి వి.మధు కు ఉత్తమ అవార్డు* ఉదయగిరి, ఆగష్టు 23 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి పంచాయితీ కార్యదర్శి వెలుగోటి. మధు ఉత్తమ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఉత్తమ అధికారుల జాబితాలో మధు ముందు వరుసలో నిలిచారు. గత 4 సంవత్సరాల నుండి ఆయన అవార్డులకు ఎంపిక కాబడుతుండటం గమనించదగిన విషయం. పంచాయితీ సెక్రటరీగా కలిగిరిలో గ్రామ పంచాయితీ అభివృద్ధికి బంగారు బాటలు వేశారు. ఎంతోకాలంగా ఆక్రమణల చెరలో ఉన్న పంచాయితీ స్థలాలకు కబ్జా కోరల నుండి విముక్తి కల్పించి ప్రభుత్వానికి ఆదాయ వనరులను చూపించారు. కరోనా కాలంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేశారు. ప్రతినెలా 1 వ తేదీన జరిగే ఫించన్ల పంపిణీ విషయంలో వెలుగోటి.మధు చేస్తున్న కృషి పలువురి ప్రశంసలు అందుకుంటున్నది. ఉదయం 7 గంటల కల్లా ఫించన్ల పంపిణీ లక్ష్యాలను అధిగమించి అందరి చేత బేష్ అనిపించుకుంటారు. వృత్తి పట్ల అంకితభావం కలిగిన మధును ఈ యేడాది కూడా ఉత్తమ కార్యదర్శి అవార్డు వరించడం అభినందనీయమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Image
శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల కోసం ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్రారంభం
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
పౌష్ఠిక ఆహారం అందజేత
Image
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
Image