ప్రజలందరూ సహకరించాలి :ఎం.పి.డి ఓ

చెత్తను తరలించేందుకు పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులు ప్రతినిత్యం ప్రత్యేక వాహనాలతో ఆయా ప్రాంతాలకు వస్తుంటారని చెత్తా చెదారమును వారికి అందజేస్తే గ్రామానికి దూరంగా ఉన్న డంపింగ్ యార్డులకు తరలిస్తామన్నారు. కనుక ప్రజలందరూ కూడా ఈ సూచనలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా అధికారులకు ప్రజలందరూ సహకరించాల్సిన భాధ్యత ఉందన్నారు. విధిగా మాస్కులు ధరించడం, స్వీయ నిర్భంధంలో ఉండాలని, చేతులను ఎప్పటికప్పుడు సబ్బులు, శానిటైజర్లతో శుభ్రపరుచుకుంటూ స్వచ్చమైన వ్యక్తిగత ఆరోగ్యమును పదిలపరుచుకోవాలని యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.