హర్జిత్ సింగ్ పోరాట పటిమ పోలీసు శాఖ కు ఆదర్శం : డి‌జి‌పి గౌతమ్ సవాంగ్ IPS


హర్జిత్ సింగ్ పోరాట పటిమ పోలీసు శాఖ కు ఆదర్శం : డి‌జి‌పి గౌతమ్ సవాంగ్ IPS
      అమరావతి, ఏప్రిల్ 27 :  కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వలు విధించిన లాక్ డౌన్ ను అమలు చేస్తున్న క్రమంలో విధులు నిర్వహిస్తున్న పంజాబ్ పోలీస్ శాఖ కు చెందిన హర్జీత్ సింగ్ పై కొంతమంది అల్లరిమూకలు దాడి చేసి చేతి మనికట్టును అత్యంత దారుణంగా నరికినప్పటికి గాయాన్ని సైతం లెక్కచేయకుండా అల్లరిముకలను వెంటబడి వారి ఆగడాలను అరికట్టిన హర్జీత్ సింగ్ ధైర్యసాహసాలు పోలీసు వ్యవస్థకు ప్రేరణ,ఆదర్శం, స్ఫూర్తిదాయకం.నిరంతరం ప్రజల ఆరోగ్యాన్ని రక్షిస్తూ,ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టి వైద్యం అందిస్తున్న వైదులకు చేతులెత్తి నమస్కరిస్తున్న ను.
అదే విధంగా 48 గంటలు తిరగముందే తిరిగి అతి కిష్ట్లమైన ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించి అతని చేతిని అతికించి యధాస్థితికి తీసుకొచ్చిన PGI  చండీఘఢ్ వైద్య బృందానికి,వారి నైపుణ్యానికి ఆంధ్ర ప్రదేశ్ పోలీసుల సలాం.
  కోవిడ్ 19 పై పోరాటంలో భారతదేశానికి  *ఐ కాన్* గా నిలిచిన  ఎస్.ఐ శ్రీ హర్జీత్ సింగ్ కు మద్దతుగా ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ గౌతమ్ సవాంగ్ IPS గారి ఆదేశాల మేరకు రాష్ట్రం లోని అన్ని జిల్లా యూనిట్లకు చెందిన అధికారులు హర్జిత్ సింగ్  పేరుతో *నేమ్ ప్లేట్* ధరించి, హర్జిత్ సింగ్ పోరాట స్ఫూర్తికి మద్దతు తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహించారు.మంగళగిరి లోని పోలీస్ ప్రధాన కార్యాలయం లో పలువురు ఉన్నతాధికారులు అడిషనల్ డి‌జిలు హరీష్ కుమార్ గుప్తా IPS, రవి శంకర్ అయ్యనార్ IPS, ఐ.జీలు మహేశ్ చంద్ర లడ్డ IPS, వినీత్ బ్రిజ్ లాల్ IPS, డి‌ఐజి, రాజశేఖర్ బాబు IPS మరియు ఎస్‌పిలు ఐశ్వర్యరాస్తొగి IPS, వెంకతారత్నం ఆధికారులు హర్జిత్ సింగ్  పేరుతో *నేమ్ ప్లేట్* ధరించి విధులకు హాజరైయ్యారు.IAM HARJEET SINGH ప్లే కార్డ్ ను ప్రదర్శించారు.