ఆపదలో ఉన్నవారిని ఆదుకునేవారు దేవుళ్ళతో సమానం :కేశినేని శ్వేత

విజయవాడ, ఏప్రిల్ 8


ఆపదలో ఉన్నవారిని ఆదుకునేవారు దేవుళ్ళతో సమానం అని, అందరూ సహృదయంతో ముందుకు వచ్చి కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలని కేశినేని శ్వేత పిలుపునిచ్చారు.
వజ్రా యూత్ టీం తరపున వల్లూరు రవితేజ,ముప్పవరపు వెంకటకృష్ణ,మనోహర్ పాల్ మరియు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో 11వ డివిజన్ రెల్లిస్ కాలనీ వద్ద జరిగిన 300 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు.
ఎంపీ కేశినేని నాని గారి పిలుపు మేరకు స్వచ్చందంగా ముందుకు వచ్చి సహాయం చేస్తున్న యువకులను అభినందించారు.
కరోనా లాక్ డౌన్ వల్ల 
బయటకు రాలేని పరిస్థితి,
పనులకు వెళ్లలేని పరిస్థితుల్లో నిస్సహాయులకు ప్రతి ఒక్కరూ ఎవరికి తోచిన విధంగా వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి సహాయపడాలని కోరారు