భువనగిరి నుండి వింజమూరు వరకు వలసవాసులు భోజనాలు ఏర్పాటు చేసిన ఎస్.ఐ...

భువనగిరి నుండి వింజమూరు వరకు వలసవాసులు


భోజనాలు ఏర్పాటు చేసిన ఎస్.ఐ...


వింజమూరు, ఏప్రిల్ 29 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని నల్లగొండ్ల గ్రామానికి చెందిన రెండు వలస కుటుంబాలను గుర్తించిన ఎస్.ఐ బాజిరెడ్డి వారికి ముందుగా భోజన ఏర్పాట్లు చేసి తన ఉదారతను చాటుకున్నారు. వివరాలలోకి వెళితే మండలంలోని నల్లగొండ్ల గ్రామానికి చెందిన రెండు కుటుంబాలు జీవనభృతి కోసం 2 నెలల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి జిల్లాకు కూలి పనుల నిమిత్తం వెళ్ళారు. అయితే కరోనా వైరస్ నేపధ్యంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడంతో అక్కడ కూలి పనులు లేక వారి పరిస్థితులు దుర్భరంగా మారాయి. గత్యంతరం లేని పరిస్థితులలో వారం రోజుల క్రితం భువనగిరిలో కాలినడకన వింజమూరు మండలంలోని స్వగ్రామమైన నల్లగొండ్లకు బయలుదేరారు. ఈ రోజు మధ్యాహ్నానికి వారు దుత్తలూరుకు చేరుకుంటారన్న ముందస్తు సమాచారంతో వింజమూరు ఎస్.ఐ ఒక ప్రత్యేక వాహనమును ఏర్పాటు చేసి వారిని నేరుగా వింజమూలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి వెంటనే అర్ధాకలితో అలమటిస్తున్న వారికి భోజనాలు అందించారు. తెలంగాణా నుండి వివిద ప్రాంతాల మీదుగా ఈ రెండు కుటుంబాలు కాలినడకన ప్రయాణం చేయడంతో వారికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.