దేశ, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు చాలా కష్టాల్లో ఉన్నాయి :అంబటి రాంబాబు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం
తాడేపల్లి
ఏప్రిల్ 5
.
 పార్టీ ఎమ్మెల్యే శ్రీ అంబటి రాంబాబు ప్రెస్ మీట్- కరోనాను ఎదుర్కోనేందుకు దేశమంతా సంఘటితంగా పోరాడుతోంది. 


- ప్రస్తుతం దేశంలో ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. 


- దేశ, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు చాలా కష్టాల్లో ఉన్నాయి. 


- కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవాలనేదే సీఎం శ్రీ వైయస్ జగన్ లక్ష్యం. 


- రాత్రి 9 గంటలకు క్యాoడిళ్లు, దీపాలు వెలిగించి కష్టాల్లో ఉన్న ప్రజలకు ఓ సందేశం ఇవ్వాలన్నదే ప్రధాని ఉద్దేశ్యం. 


- వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రజల కోసం సేవలందిస్తున్నారు. 


- విపత్కర పరిస్థితుల్లో కూడా చంద్రబాబు రాజకీయ విమర్శలు చేస్తున్నారు. 


- ఈ పరిస్థితుల్లో టీడీపీ నేతలు అడ్డగోలుగా ట్వీట్లు చేస్తున్నారు. 


- చంద్రబాబు, పవన్, కన్నా లక్ష్మీనారాయణ విధానాలు ఒకేలా ఉన్నాయి. 


- బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వ సొమ్మును పంచుతున్నామని అంటున్నారు. 


_ ఈ డబ్బు నరేంద్ర మోడి గారిదో,శ్రీ జగన్ గారి గా కాదు ప్రజల డబ్బు.


- కోటి 33 లక్షల పేదలకు రాష్ట్ర ప్రభుత్వమే రూ.1000 వాలంటీర్ల ద్వారా అందజేసింది. 


- అవినీతి జరిగినట్లు ఆధారాలు చూపిస్తే ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. 


- రూ.1000 ఇచ్చి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్నట్లుగా ఓ వీడియో పెట్టారు. 


- కన్నా లక్ష్మీనారాయణకు చిత్తశుద్ధి ఉంటే ఆ వీడియో ఎక్కడిదో బయటపెట్టాలి. 


- ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ విధానాలను ప్రజలు ఆదరిస్తున్నారనే టీడీపీ కడుపుమంట. 


- 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రెవెన్యూ లోటు కింద కేంద్రం నిధులు విడుదల చేసింది. 


- ఏపీతో పాటు 13 రాష్ట్రాలకు నిధులు విడుదలయ్యాయి. 


- ఏపీకి ప్రత్యేకంగా నిధులేమీ కేటాయించలేదు.