అధికార పార్టీ అవినీతి పై గవర్నర్ జోక్యం చేసుకోవాలి

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సాయి కృష్ణ ప్రెస్ పాయింట్స్ - 27.04.2020


*అధికార పార్టీ అవినీతి పై గవర్నర్ జోక్యం చేసుకోవాలి*


* రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అరాచక పాలన పై గవర్నర్ జోక్యం చేసుకోవాలి.
* గతంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో పెద్ద యెత్తున బెదిరింపులు, దౌర్జన్యాలు చోటు చేసుకున్నాయి. అందుకే ఎన్నికల ప్రక్రియ మొత్తం, ఏకగ్రీవం అయినవి, నామినేషన్లు జరిగినవి అన్నీ రద్దు చేసి మొత్తం ప్రక్రియను పుర్ణిర్వహించాలి.


* ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన కరోనా పరీక్షల కిట్లు కొనుగోలులో పెద్ద యెత్తున జరిగిన అవినీతి పై గవర్నర్ జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నాడు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే ఈ అంశాలపై గవర్నర్ కు లేఖలు రాశారు.


* విధి నిర్వహణలో ముందు వరసలో ఉండి పనిచేస్తున్న జర్నలిస్ట్ సోదరులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలి. కరోనా బాధితులు, ఆసుపత్రులు, క్షేత్రస్థాయిలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న పాత్రికేయులకు బీమా సౌకర్యం కల్పించడం ఎంతో ముఖ్యమని బీజేపీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నది.


* అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులు ఈ కరోనా మహమ్మారి లాక్ డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయి, అన్ని ఆదాయ మార్గాలు మూసుకుపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా ప్రభుత్వం ఇవ్వవలసిన లీజును రెట్టింపు చేయాలని, తక్షణం వారికి ఆ మొత్తాన్ని విడుదల చేయాలి.


* కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న కర్నూల్, గుంటూరు మరియు విజయవాడలో ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను కఠిన తరం చేయాలి. ఎటువంటి మినహాయింపులు, ఏ వర్గానికి ఇవ్వటం మంచిది కాదు. 


*రెడ్ జోన్ ఏరియాలలో ప్రజలు బయటకు రాకుండా నిత్యావసర వస్తువులు, కూరగాయలు, అవసరమైన మందులు, అన్నీ ఇండ్ల వద్దకే చేర్చే ఏర్పాట్లు చేయాలి.


* ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఉచితంగా ప్రతి వ్యక్తికీ మూడు మాస్కులు  అందజేస్తామని చెప్పిన విషయం మరిచిపోయింది. ఏం ఒక్కరికీ ఇచ్చిన పాపాన పోలేదు. తక్షణం ఈ మాస్కుల పంపిణీ చేపట్టాలి.


* వైసీపీ చేసే ప్రతి రాజకీయ ఆరోపణ కు లాక్ డౌన్ ముగిసిన తర్వాత ధీటుగా సమాధానం చెప్తాం. ప్రస్తుతం రాజకీయ అరోపణల జోలికి వెళ్లకుండా సమస్యలను మాత్రమే ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్న బీజేపీ పై అసందర్భ ఆరోపణలు చేస్తున్న వెల్లంపల్లి నోరు అదుపులో పెట్టుకోవాలి.


ధన్యవాదాలతో...


*కోట సాయి కృష్ణ*
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసర నిబంధనలను పక్కన పెడతాం
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image