*ఈ కరోనా మరణ మృదంగాన్ని ఆపేదెవరు*
*మరో ధారవి కానున్న జక్కంపూడి కాలనీ*
*అధికారులను పరుగులు తీయిస్తున్న కరోనా కేసులు*
*నిన్న కృష్ణలంక బాటలో.....నేడు జక్కంపూడి కాలనీ*
విజయవాడ. ఏప్రిల్...28
ఇందుకలదు అందలేదు ....ఎందెందు వెతికినా అందునే కలదు అన్న చందంగా నేడు కరోనా కేసులు లేని ప్రాంతాలు లేకుండా పోయింది ....సుమారు 40 వేలమంది నివసిస్తున్న జక్కంపూడి కాలనీలో కరోనా కోవిడ్ 19 వైరస్ కేసు నమోదైంది ........
కృష్ణలంకలో కరోనా నియంత్రణ కోసం అధికారులు ప్రత్యేక బలగాలతో కవాతుకూడా నిర్వహించారు.. జులాయిగా తిరుగుతున్న యువకులు క్వారెంటెయిన్ సెంటర్లోకి తరలించారు.....
తెల్లారేసరికి జక్కంపూడి కాలనీలో కరోనా కేసు బయట పడింది వందలాది కుటుంబాలు నివసిస్తున్న కాలనీలో ఇల్లు ,మెట్లు ,ఇరుకిరుగ్గా ఉన్నాయి పైగా కరోనా బాధితుడు టీ అమ్మేవాడు .
కాలనీలో ఇల్లిల్లూ తిరుగుతూ అమ్ముతుండేవాడు ..అంతేగాకుండా అతను ఆటోనగర్, శ్రామికనగర్, సనత్ నగర్ ,తదితర ప్రాంతాల్లో కూడా టీ అమ్మి జీవిస్తున్నాడు
సనత్ నగర్ లో అతనికి ఈ అంటువ్యాది అంటుకొందని అధికారులు భావిస్తున్నారు..
అతను తిరిగిన ,టీలు అమ్మిన ప్రాంతాల్లో అతని టీ తాగిన వారందరి వివరాలు సేకరించడం అధికారులకు అగ్నిపరీక్షే ......ప్రపంచంలోనే అతి పెద్దదయిన
ముంబైలోని ధారవి మురికివాడ లాగా విజయవాడలో జక్కంపూడి కాలనీ కూడా స్లమ్ ఏరియనే......అలాంటి చోట కరోనా కేసులు నమోదయ్యాయంటే దాని విజృంభణ ఇకముందు భయానకమే .......
కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం ,అధికారులు ,అన్ని శాఖలు నిర్విరామంగా శ్రామిస్తుంటే బాధ్యత భయం లేకుండా ప్రజలు తిరుగుతూనే వున్నారు ....
ఇక బెజవాడకు మూడిందే........సిగరెట్లు కోసం టీ కోసం ...టైమ్ పాస్ కోసం యువకులు రోడ్డుపై తిరుగుతూనే వున్నారు .......
పోలీసుల హెచ్చరికలు పెడచెవిన పెడుతున్నారు ....పేకాట ఆడి ఒకడు ....అష్టాచెమ్మా ఆడి మరోమహిళ, టీలు అమ్ముకోడానికి తిరిగి నేడు మరొకరు ...ఇలా ఇలా వ్యాధిని ఒకరినొకరు అంటించుకొంటూపోతే కరోనా ఎలా నియంత్రణకు వస్తుంది ........
పోలీసులు, వైద్యులు, నర్సులు ,పారిశుద్ధ్య కార్మికులు, కరోనా బారిన పడుతున్నారు... ఐనా ...వారు విధులు నిర్వహిస్తున్నారు.....
వారందరు విసుగుతో విధులు నిర్వహించే బాధ్యత విస్మరిస్తే...
ఒక్కసారి ఆలోచించండి .......ఊహకే భయంకరమైన వణుకుపుడుతుంది .
కరోనా కేసులు మూడంకెలుకు చేరుకొంది ..నగరంలో లక్షలాదిమందికి సోకకుండా ఎవ్వరికి వారు స్వీయనియంత్రణ తో ఇంటినుండి బయటకు రాకుండా కరోనా విస్తరించకుండా నగరాన్ని కాపాడుకోలేమా.....
ఇంటిబయటకు రాకండి కరోనాని ఇంట్లోకి తేకండి ..
అధికారులకు సహకరించండి మనల్ని మనం కాపాడుకొంటూ మన కుటుంబాన్ని కాపాడుకొంటూ , తద్వారా నగరాన్ని ,జిల్లాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోలేమా...
దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సూచనలు పాటిద్దాం ..కరోనా కోవిడ్ 19 మహమ్మారిని తరిమికొట్టాలి...... దానిగ్గను ..మనమేమి చెయ్యాల్సిన పనిలేదు...... ఇల్లు వదిలి బయటకు రాకుండా ఉండడమే........ఇట్లు..... యేమినేని వెంకటరమణ ......ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం ..నగర ప్రధాన కార్యదర్శి .......