యూనిఫారం పైన హర్జిత్ సింగ్ పేరుతో ఉన్న ఫోటోను షేర్ చేసిన డిఐజి పి.హెచ్.డి రామకృష్ణ

పంజాబ్ రాష్ట్ర ఏఎస్ఐ హర్జీత్ సింగ్ కి సంఘీ భావంగా, గుంటూరు అర్బన్ పోలీస్ అధికారి డిఐజి పి.హెచ్.డి రామకృష్ణ  యూనిఫారం పైన హర్జిత్ సింగ్ పేరుతో ఉన్న ఫోటోను షేర్ చేసినారు.
 దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విదించిన లాక్ డౌన్ ను ప్రజలకు కరోనా వైరస్ సోకకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యగా దేశమంతటా పటిష్టంగా నిర్వహిస్తున్న సందర్భంలో, పంజాబ్ రాష్ట్రంలోని పటియాలా నగరంలో కూరగాయల మార్కెట్ దగ్గర లాక్ డౌన్ విధుల్లో ఉన్న పోలీసులపై కొందరు దుండగులు కత్తులతో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. పాస్ లు చూపించాలని అడగటంతో వారు పోలీసులపై దాడికి తెగబడ్డారు. అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ హర్జీత్‌ సింగ్‌ చేతిని కత్తితో నరికారు.  మరో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ASI ని చండీఘడ్ లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. డాక్టర్ల బృందం చేసిన సర్జరీలో తెగిపోయిన చేతిని డాక్టర్లు తిరిగి అతికించారు. మహమ్మారి ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి సమయంలోనూ పోలీసులు ప్రాణాలకు తెగించి లాక్ డౌన్ విధులు నిర్వ హిస్తున్నారు. మండుటెండుల్లో డ్యూటీలు చేస్తున్నారు. ప్రజలు బయటకు రాకుండా చూస్తూ కరోనా వ్యాప్తిని అడ్డు కోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ, దురదృష్టవశాత్తు కొన్ని చోట్ల పోలీసుల పైన, వైద్యుల పైన, ఇతరుల పైన దాడులు జరుగు తున్నాయి. ఈ సందర్భంగా ఇట్టి చర్యలను ఖండిస్తూ, విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ వారికి సంఘీభావం ప్రకటించడం జరిగింది.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image