విజయవాడ
రమేష్ నాయుడు.. బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు
కరోనా సాయం పేరుతో వైసీపీ నేతలు ఫొటోలకు ఫోజులిస్తూ.. కనీస జాగ్రత్తలు పాటించకుండా వ్యాప్తికి కారణమవుతున్నారు
ఉదాహరణకు రోజా నటనా చాతుర్యం, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే , ఇతర నేతలు కార్యక్రమాలను సీఎం పరిశీలించాలి
రాష్ట్రంలో వైసీపీ నేతల అనుచరులు సారాయి తయారీలో నిమగ్నమయ్యారు
మద్య నిషేధం అని సీఎం చెబుతుంటే.. ఆపార్టీ నేతలు మాత్రం సారాయి ద్వారా ఆర్ధిక ప్రయోజనాలను పొందుతున్నారు
రాష్ట్రంలో ఇంత జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి కి తెలియదా అంటే.. ఎవరైనా నమ్ముతారా
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సాయం సొమ్మును జేబుల్లో వేసుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
కరోనా కష్టకాలంలో ఇసుక దోపిడీ, సారాయి రవాణా, ఇతర అక్రమాల ద్వారా ఎలా దోచుకోవాలనే దానిపైనే వైసీపీ నేతలు ఆలోచన చేస్తున్నారు
సీఎం ఇటువంటి అక్రమాలకు చెక్ పెట్టేలా వ్యవహరించాలని.. బీజేపీ సూచిస్తుంది
కరోనా కారణంగా.. పండించిన పంటను కొనే నాధుడు లేక రైతన్నలు రోధిస్తున్నారు .రైతాంగాన్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి, వారిని ఆదుకునేందుకు సాయం అందించాలి.ఆర్ధికపరమైన కష్టాలు ఉన్నప్పటికీ సీఎం అమ్మఒడి, విద్యాదీవెన కింద చేస్తున్న ప్రయత్నంపై హర్షం వ్యక్తం చేస్తున్నాం.పేద విద్యార్దులను ఉన్నతస్థాయికి తీసుకువెళ్లేందుకు తల్లి ఎకౌంట్ లో నగదు జమ చేయడాన్ని స్వాగతిస్తున్నాం