ప్రభావిత రంగాల్లో పరిస్థితులపై సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్ష

కోవిడ్‌ –19 నివారణా చర్యలు, ప్రభావిత రంగాల్లో పరిస్థితులపై సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్ష


అమరావతి: ఏప్రిల్ 29 (అంతిమ తీర్పు ) : కోవిడ్‌ –19 నివారణా చర్యలు, ప్రభావిత రంగాల్లో పరిస్థితులపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష
క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ తదితర అధికారులు
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివరాలు అందించిన వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి


గుజరాత్‌ నుంచి తెలుగు మత్స్యకారులను తిరిగి స్వస్థలాలకు తీసుకు వస్తున్న అంశంపై అధికారులనుంచి వివరాలు కోరిన సీఎం
రవాణా ఖర్చులు, భోజనం, దారిఖర్చులు అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని వెల్లడించిన అధికారులు
4,065 మందికిపైగా స్వస్థలాలకు బయల్దేరారని వెల్లడించిన అధికారులు
మత్స్యకారులు తిరిగి వచ్చిన తర్వాత వారికి రూ.2వేల చొప్పున ఇవ్వాలని సీఎం ఆదేశం


రాష్ట్రంలో నమోదైన కేసులు, తీసుకుంటున్న చర్యలపై సీఎం సమీక్ష
గడచిన 24 గంటల్లో 73 కేసులు నమోదయ్యాయని వెల్లడి
గుంటూరులో నమోదైన 29 కేసుల్లో 27 కేసులు నర్సరావుపేట నుంచే వచ్చాయన్న అధికారులు
అక్కడ పెద్ద ఎత్తున కంటైన్‌ మెంట్‌చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు
రాష్ట్రంలో పాజిటివిటీ శాతం 1.51శాతం అయితే, దేశవ్యాప్తంగా పాజిటివిటీ కేసులు 3.84శాతంగా ఉందన్న అధికారులు
గడచిన 24 గంటల్లో 7,727 పరీక్షలు చేశామని తెలిపిన అధికారులు
ఇందులో 70శాతం వరకూ పరీక్షలు రెడ్‌జోన్లలోనే చేశామన్న అధికారులు
ఇప్పటివరకూ 88,061 పరీక్షలు చేశామని, ప్రతి మిలియన్‌కు 1649 పరీక్షలు చేశామన్న  అధికారులు


క్లస్టర్ల వారీగా కూడా వెరీ యాక్టివ్,  యాక్టివ్, డార్మంట్‌  క్లస్టర్లు గుర్తించామన్న అధికారులు
గడచిన 5 రోజుల్లో కేసులు నమోదైన క్లస్టర్లను వెరీ యాక్టివ్‌ క్లస్టర్లుగా పరిగణిస్తున్నామన్న అధికారులు. వెరీ యాక్టివ్‌ క్లస్టర్లు 76
5 నుంచి 14 రోజులుగా కేసులు లేని యాక్టివ్‌ క్లస్టర్లు 55 
14 నుంచి 28 రోజులుగా కేసులులేని డార్మంట్‌ క్లస్టర్లు  73
28 రోజులనుంచి కూడా కేసులు లేని క్లస్టర్లు 13 
మరింత ఫోకస్‌గా పనిచేయడం కోసం ఈవిశ్లేషణను కలెక్టర్లకు అందిస్తామన్న  అధికారులు


శ్రీకాకుళం రిమ్స్‌లో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో ట్రయల్‌ టెస్టులు ప్రారంభం అయ్యాయని సీఎంకు వెల్లడించిన అధికారులు
ఒంగోలులో ల్యాబ్‌ ఏర్పాటు చర్యలుకూడా ప్రారంభమయ్యాయని వెల్లడి
నెల్లూరులో కూడా ల్యాబ్‌ ఏర్పాటు ముమ్మరంగా సాగుతోంది
శనివారం నాటికి ఈ మూడు కొత్త ల్యాబ్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయన్న అధికారులు
ఇప్పటివరకూ 8 జిల్లాల్లో 9 ల్యాబ్‌లు పనిచేస్తున్నాయన్న అధికారులు
ఇవికాక ప్రతి ఏరియా ఆస్పత్రి, టీచింగ్‌ ఆస్పత్రుల్లో సుమారు 50 చోట్ల ట్రూనాట్‌ కిట్లు ఉన్నాయి
డీఆర్డీఓతో మాట్లాడి మొబైల్‌ ల్యాబ్‌ను కూడా తయారు చేయిస్తున్నామని వెల్లడి


టెలిమెడిసిన్‌ పరీక్షపై సీఎం నిశిత పరీక్ష
ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం టెలిమెడిసిన్‌కు కాల్‌చేసిన వారికి అదేరోజు మందులు అందించే ప్రయత్నాలు చేస్తున్నామన్న అధికారులు
టెలిమెడిసిన్‌ వ్యవస్థ మరింత సమర్థవంతంగా అమలు చేసేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నామన్న అధికారులు
మందులు వెళ్లాయా? లేదా? అన్నదానిపై పూర్తిగా అధికారుల పర్యవేక్షణ ఉంటుందన్న అధికారులు
జిల్లాకు ఏర్పాటుచేస్తున్న ముగ్గురు జేసీల్లో ఒకరికి పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించాలన్న సీఎం
టెలిమెడిసిన్‌కు సంబంధించి సరైన ఎస్‌ఓపీని రూపొందించుకోవాలన్న సీఎం
పూర్తిస్థాయిలో దృష్టిపెట్టి... టెలిమెడిసన్‌ను సమర్థవంతంగా అమలు చేయాలన్న సీఎం


కుటుంబ సర్వేలో గుర్తించిన వారికి పరీక్షలపై సీఎం ఆరా
ఇప్పటివరకూ 12,247 పరీక్షలు చేశామన్న అధికారులు
మిగిలిన వారికి కూడా వీలైనంత త్వరగా పరీక్షలు చేయాలన్న సీఎం
మూడు రోజుల్లో పూర్తిచేస్తామన్న అధికారులు 


వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు గత ఏడాదితో పోలిస్తే ఏ పంటలోనైనా రైతుల వద్దనుంచి ఎక్కువే కొనుగోలు చేశామన్న సీఎం
గతంలో ప్రభుత్వం ఎప్పుడూ కొనుగోలు చేయని మొక్కజొన్నను కూడా సేకరిస్తున్నామన్న సీఎం
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా మార్కెట్లో ధరల స్థిరీకరణ పరిస్థితులు చోటుచేసుకున్నాయన్న అధికారులు
ఈ క్రాపింగ్, ఫాంగేట్, టోకెన్ల పద్ధతిద్వారా కొనుగోలు తదితర చర్యలతో ముందుకు సాగుతున్నాయన్న అధికారులు
అరటి, టొమాటో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాట్లపై దృష్టిపెట్టాలన్న సీఎం
చీనీ పంటకు ధర వచ్చేలా చూడాలన్న  సీఎం
గాలివాన కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వెంటనే ఎన్యుమరేషన్‌ చేసి రైతులను ఆదుకోవాలని సీఎం ఆదేశం
ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుని వాటిద్వారా కూరగాయలను పంపిస్తున్నామని, మంచి ఆదరణ లభిస్తోందని వెల్లడించిన అధికారులు
రెడ్‌జోన్లకు చేరువగా ఇలాంటి కార్యకలాపాలు కొనసాగాలన్న సీఎం. పాల్గొన్న సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఇతర ఉన్నతాధికారులు.


Popular posts
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
బలోపేతానికి చారిత్రక ప్రణాళిక రూపొందించిన ఏపీ ప్రభుత్వం
Image