సమైక్యంగా కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమి కోడదాం

*సమైక్యంగా కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమి కోడదాం


*ఇంట్లోనే ఉండండి...క్షేమంగా ఉండండి*   


       గూడూరు ఏప్రిల్ 9:  లాక్ డౌన్ లో చిక్కుకున్న వలస కార్మికులకు, నిరాశ్రయులకు  చేగువేర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ*


*9వ రోజు ఆహార పంపిణీ కార్యక్రమం దాతగా మీనిగాల విజయ్ కుమార్*


*క్లిష్ట సమయంలో పోలీసుల సేవలు మరువలేనివి*


*కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్లో అన్ని వర్గాల ప్రజలు ఇంటికే పరిమితం అయ్యారని ఈ కష్ట కాలంలో చేగువేరా ఫౌండేషన్ అభాగ్యులకు అండగా నిలవడం అభినందనియమని గూడూరు రెండో పట్టణ ఎస్. ఐ ఆదిలక్ష్మి,హోమియే పతి వైద్యులు మీనిగల విజయకుమార్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా చేగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండ్ల సురేష్ బాబు,అధ్యక్షులు గుండాల ఆది నారయణ ల ఆధ్వర్యంలో ఒరిస్సా కార్మికులకు,ఉపాధి లేక సతమత మవుతున్న ప్రజలకు ఆహారం పంపిణీ కార్యక్రమం విజయ వంతంగా జరుగుతోంది.9వ రోజు ఆహార పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది.కరోనా వ్యాప్తి నివారణ,లాక్ డౌన్ విధులలో వున్న పోలీసులకు ,ఉపాధి లేక ఇళ్లలో ఉన్న పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎస్.ఐ ఆదిలక్ష్మి,కార్యక్రమం దాత మీనిగ ల విజయ కుమారులు మాట్లాడుతూ పేద వర్గాల ప్రజలకు చేగువేరా ఫౌండేషన్ అందిస్తున్న సేవలు సమాజ ఉన్నతికి తోడ్పడుతున్నాయన్నారు.. సురేష్ బాబు మాట్లాడుతూ  వైయస్అర్ కాంగ్రెస్స్ పార్టీ, రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి కష్ట కాలంలో ప్రజలకు అండగా వున్నారని ఏ ఒక్కరు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.కరోనా నివారణ చర్యల్లో పోలీసుల సేవలు ఎన్నటికీ మరువలేమన్నరు.జగనన్న పిలుపుతో కోవిడ్-19 కారణంగా ఉపాధి లేక సతమత మవుతున్న బాధితులకు చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనునిత్యం ఆహార పంపిణీ జరగుతోందన్నారు.లాక్ డౌన్లో ఉపాధి కోల్పోయి చవటపాలెం,చిల్లకూరు ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 9 రోజులుగా ఆహారం అందిస్తున్నామన్నారు.కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కవ అయినందున ప్రజలు అధికార యంత్రాంగం తెలిపిన సూచనలు పాటించి జాగ్రత్త పడాలనీ సూచించారు.ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు చేగువేరా టీమ్ శక్తివంచన లేకుండా పనిచేస్తుందన్నారు.ఈ కార్య కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ క్రాంతికుమార్‌. మదురెడ్డి,ఆన్సర్ భాష,నరేష్ రెడ్డి మరియు పైలట్ టీమ్ వినోద్,పవన్,భాస్కర్,అజయ్, సంతన్, సాయి మహేష్,లక్ష్మి నారాయణ,తరుణ్ తదితరులు పాల్గొన్నారు*