అత్యవసరమైతే పోలీస్‌ పాస్‌ తీసుకోండి: డీజీపీ గౌతమ్‌ సవాంగ్

అత్యవసరమైతే పోలీస్‌ పాస్‌ తీసుకోండి: డీజీపీ గౌతమ్‌ సవాంగ్.


అమరావతి, ఏప్రిల్ 27 (అంతిమ తీర్పు):
రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలవుతున్న తరుణంలో ఎవరైనా అత్యవసర పనులపై ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ఈ–పాస్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. తగిన కారణాలు, ఆధారాలు చూపించి ఈ–పాస్‌కు దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని స్పష్టం చేశారు.
 
దీనికి సంబంధించి డీజీపీ తెలిపిన వివరాలివీ.
 
► లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న దృష్ట్యా వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లే వారు ఇబ్బందులకు గురవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అలాంటి వారికి పోలీస్‌ శాఖ ద్వారా అత్యవసర రవాణా పాస్‌లను జారీ చేస్తాం.
► జిల్లా పరిధిలో వెళ్లాల్సి వస్తే.. ఆ జిల్లా ఎస్పీకి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. వేరే జిల్లాకు వెళ్లాల్సి వస్తే.. తమ జిల్లా ఎస్పీ ద్వారా ఆ వ్యక్తి వెళ్లాల్సిన జిల్లా ఎస్పీ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది.


► వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తే.. సదరు వ్యక్తికి సంబంధించిన జిల్లా ఎస్పీ ద్వారా డీఐజీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలి. వివరాలన్నీ పరిశీలించి ఆయా రాష్ట్రాలను సంప్రదించిన అనంతరం డీఐజీ కార్యాలయం అనుమతి మంజూరు చేస్తుంది.
► పాస్‌ అవసరమైన వారు చిరునామా, ఆధార్, ప్రయాణించే వాహనం నంబర్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారనే వివరాలు సమర్పించాలి.
► పాస్‌ కోసం జిల్లా ఎస్పీల వాట్సాప్, ఈ–మెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
► దరఖాస్తులను పరిశీలించాక వారి మొబైల్‌ నంబర్లకే పోలీసులు అనుమతులు పంపిస్తారు. ఈ–పాస్‌ తీసుకున్న వారు గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. 
 
ALL UNIT OFFICERS WHATSAPP NUMBERS & Email id'S
S.No  Unit Name            WHATSAPP  Mobile Number      e-mail ID's
 
1. SRIKAKULAM                       6309990933                     dail100srikakulam@gmail.com
 
2. VIZIANAGARAM                   9989207326                     spofvzm@gmail.com
 
3. VISAKHAPATNAM RURAL   9440904229                     vizagsp@gmail.com
 
4. VISAKHAPATNAM CITY       9493336633                     cpvspc@gmail.com
 
5. EAST GODAVAI (KAKINADA) 9494933233                  sp@eg.appolice.gov.in
 
6. RAJAHMUNDRY URBAN     9490760794                     sp@rjyu.appolice.gov.in
 
7. WEST GODAVARI                 8332959175                    policecontrolroomeluruwg@gmail.com
 
8. KRISHNA (MACHILIPATNAM) 9182990135                 sp@kri.appolice.gov.in
 
9. VIJAYAWADA CITY               7328909090                    cp@vza.appolice.gov.in
 
10. GUNTUR RURAL                 9440796184                   Dail100gunturrural@gmail.com
 
11.GUNTUR URBAN                  8688831568                  guntururbansp@gmail.com
 
12.PRAKASHAM                        9121102109                  spongole@gmail.com
 
13. NELLORE                             9440796383                  nelloresp@gmail.com
 
14.CHITTOOR                            9440900005                  spchittoor@gmail.com
 
15. TIRUPATHI URBAN              9491074537                  sptpturban@gmail.com
 
16.ANANTHAPURAM                9989819191                   spatp1@gmail.com
 
17.KADAPA                                9121100531                    spkadapa2014@gmail.com
 
18.KURNOOL                            7777877722                    spkurnool.kur@gmail.com
 


అత్యవసర పనుల కోసం పాస్‌లు తీసుకోదలచినవారు తమ యొక్క వినతిపత్రాలను పైన ఇచ్చిన వాట్సప్‌ మొబైల్ నెంబర్లకు మరియు మెయిల్ ఐడీలకు మాత్రమే పంపగలరు. అంగీకరించిన అనుమతి పత్రాలు మీరిచ్చే మొబైల్ నెంబర్లకు/మెయిల్ కు అనుమతి పంపబడును.


మీరు ప్రయాణించేటపుడు జిల్లాల యొక్క  వాట్సప్‌ నెంబర్ మరియు మెయిల్ ఐడీల నుంచి వచ్చిన అనుమతులు మాత్రమే అంగీకరించబడును. ఫార్వర్డ్‌ చేయబడిన అనుమతులు (పాసులు) అంగీకరించబడవు.


మీరు ప్రయాణించేటప్పుడు మీతోపాటు మీయొక్క *గుర్తింపు కార్డు (ఐడీ కార్డ్‌) తప్పనిసరిగా ఉంచుకోవాలని*  డీజీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.