ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి నారా లోకేష్ లేఖ

అన్న‌దాత‌ల్ని ఆదుకోండి 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రికి  తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ‌తేదీః 27-04-20
గౌరవనీయులైన
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు 
         


               విషయం- రాష్ట్రంలో అన్నదాతల ఇబ్బందులు, పంటల కొనుగోలు, గిట్టుబాటు ధరలు కల్పించడం, అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవడం గురించి 


         రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అన్నదాతలు తాము పండించిన పంటలను అమ్ముకోలేక అవస్థలు పడుతుంటే ప‌ట్టించుకోవాల్సిన మీరు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పంటలను కొనుగోలు చేస్తున్నామనే వ్యవసాయ మంత్రి హామీ అరకొరగానే అమలవుతోందన్న విషయం వాస్తవం కాదా? ఉద్యానవన పంటల రైతుల గోడు వినేవారు కరువయ్యారు. మార్కెటింగ్  సదుపాయం లేకపోవడంతో రైతులు తమ ఉత్పత్తులను రోడ్లపైనే పారబోస్తున్న విషయం మీ దృష్టికి రాలేదా? వచ్చినా మొద్దునిద్ర నటిస్తున్నారా?  ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులకు సరైన గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో.. అప్పుల భారం పెరిగి ఆత్యహత్యలకు పాల్పడుతున్నారు. రైతులకు భరోసా ఇవ్వడంలో మీ ప్ర‌భుత్వం విఫల‌మైంది. రబీ సీజన్ లో వరి 55 లక్షల మెట్రిక్ టన్నులు, మొక్కజొన్న 14.5, శనగ 5.50, జొన్న 3.50, పసుపు 2.00, మిర్చి 8.50, కంది 1.90, మినుము 2.50, పెసర 0.50 లక్షల మెట్రిక్ టన్నుల మేర దిగుబడులొచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల మేర పండ్ల ఉత్పత్తులు జరగగా.. అందులో అరటిని నామ్ కే వాస్తేగా కేవలం 7వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. అరటి గెల రూ.40 నుంచి రూ.50కే అమ్ముకోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ప్రకటనలకు, కొనుగోలుకు ఎంత అగాధం ఉందో అర‌టిధ‌ర చూస్తే అర్థమ‌వుతోంది. తెలంగాణ రాష్ట్రం రూ.30వేల కోట్ల రూపాయలు పెట్టి రైతుల పంటలను కొనుగోలు చేస్తోంది. మీ ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయడం లేదు? అరటి టన్ను లాక్ డౌన్ కు ముందు రూ.15,000 వరకు ఉండగా.. నేడు రూ.1000 నుంచి రూ.1500 కు కొనుగోలు చేస్తున్నారు. కర్భూజ టన్ను రూ.3 వేలకు కొంటున్నారు. టమోట కేజీ రూ.2కు కొంటున్నారు. కొబ్బరికాయ వంద కౌంట్ రూ.700కు కొంటున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆక్వా రైతుల విషయంలో ప్రభుత్వం ప్రకటించిన ధరలకు, క్షేత్రస్థాయిలో చెల్లిస్తున్న ధరలకు పొంతన లేదు.
          లాక్ డౌన్ నిబంధనల నుంచి వ్యవసాయ ఉత్పత్తులకు సడలింపులు ఇచ్చినప్పటికీ తగిన ప్రయోజనం దక్కడం లేదు. రాష్ట్రంలో రబీ సీజన్ లో 22.44 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. పంటకోత, రవాణ, ఎగుమతులు, మార్కెటింగ్ సౌకర్యాలు లేక ధరలు సగానికి పైగా పడిపోయాయి. ప్రధానంగా వరి, మొక్కజొన్న, పొగాకు, పసుపు, శనగ, మిర్చి, కంది ఇలా అనేక పంటలు ఉన్నాయి. రాయలసీమతో పాటు ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో అరటి, మామిడి, బొప్పాయి, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, కొబ్బరి, కర్బూజ, పుచ్చకాయలను ఎక్కువగా సాగు చేశారు. ఆయా పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఇప్పటికీ ఖరీఫ్ కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లే పూర్తికాలేదు. రూ.300కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలు ఉన్నమాట వాస్తవం కాదా? ఇప్పుడు రబీ సీజన్ లో పంట కోతకు వచ్చింది. మిర్చి ఇప్పటికీ కల్లాల్లోనే ఉన్నాయి. వీటిని కొనే నాథుడే లేడు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తామన్న మీ హామి మాటలకే పరిమితం అయింది. ఈ-క్రాప్ బుకింగ్ తో సంబంధం లేకుండా ప్రభుత్వమే మార్కెఫెడ్ ద్వారా అన్ని వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలి. 
       మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలకు కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, అనంతపురం, కర్నూలు, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పలు పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణా, గోదావరి జిల్లాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. తక్షణమే నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందజేయాలి. వరితో పాటు వివిధ ప్రాంతాల్లో మొక్కజొన్న, నువ్వు, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలు దెబ్బతిన్నాయి. సుమారు 15 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లుగా ప్రాథమిక అంచనా ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న రైతులకు అకాల వర్షాల ద్వారా మరింత నష్టం చేకూరింది. తాత్సారం చేయకుండా ఆదుకోవాల్సిన బాధ్య‌త ముఖ్య‌మంత్రిగా మీపై ఉంది


                                                                          నారా లోకేష్
                                                      తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...
Image
87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌
Image
సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు
భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు
Image