గిట్టుబాటు ధరలు కల్పించాలని మార్కెటింగ్ శాఖ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అనుసరిస్తోంది

        తిరుపతి ,ఏప్రిల్ 27. (అంతిమ తీర్పు):              ప్రభుత్వం లాక్ డౌన్ లో కొంత సడలింపు ఇవ్వడంతో అందులో ప్రధానంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు మినహాయింపు ఇవ్వడంతో పలు పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి ఫలితంగా తిరిగి ఉపాధిని కూలీలు పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం  లాక్ డౌన్ లో సడలింపు కార్యక్రమాలను అను ఈ టీవీ లో ప్రకటించింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నడవకపోతే ఆహారోత్పత్తి కి ఎటువంటి ఇబ్బందులు ఏమైనా వస్తాయని ముందుగానే గ్రహించి అటువంటి పరిశ్రమలకు మినహాయింపు ఇవ్వడం జరిగింది ఇందులో ప్రధానంగా నిల్వ ఉంచలేని కూరగాయలకు అదేవిధంగా టమోటా పరిశ్రమలను మామిడి గుజ్జు పరిశ్రమలను తెరిపించారు ఆహార ఉత్పత్తి అయిన పరిశ్రమలు కూడా మినహాయింపు రావడంతో జీడిమామిడి పరిశ్రమలు కూడా ప్రారంభమయ్యాయి చిత్తూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పలుసార్లు రైతులు పలు పరిశ్రమల యజమానులు ఇతర ఆహార ఉత్పత్తికి సంబంధించిన పరిశ్రమల యజమానులతో చర్చలు జరిపారు ఈ చర్చల అనంతరం ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని అదేవిధంగా పోలీసుల ఆంక్షలు సైతం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు ఈ క్రమంలో జిల్లాలో టమోటా గుజ్జు తయారు చేసే పది పరిశ్రమలను తెరిచారు జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం 30 శాతం కూలీలను లేదా సిబ్బందిని వినియోగించుకోవాలని అదేవిధంగా భౌతిక దూరం పాటించాలని తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటూ ఉత్పత్తులను ప్రారంభించుకోవచ్చు నని ఆయన చెప్పడంతో  పరిశ్రమలు ప్రారంభమై టమోటా గుజ్జు లో ముఖ్యంగా రైతుకు కొంతవరకైనా గిట్టుబాటు ధర ప్రస్తుతం లభిస్తోంది ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతులు లేకపోవడంతో చిత్తూరు జిల్లాలో ప్రధానంగా ఈ పంట రెండు ప్రాంతాల రైతులకు అంతో ఇంతో గిట్టుబాటు ధరలు కల్పించాలని మార్కెటింగ్ శాఖ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అనుసరిస్తోంది ఒక్కో గుజ్జ పరిశ్రమ రోజుకు 150 టన్నుల క్రషింగ్ ప్రైస్ ది ఉండడంతో సుమారు పదిహేను వందల టన్నుల టమోటా ఫ్యాక్టరీలకు వెళ్తుంది. దీనిద్వారా రైతు పండిస్తున్న టమోటా పంటలో ఎక్కువ భాగం ఈ పరిశ్రమలకు వెళుతుంది దీంతో కొంత వరకైనా గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయి ఇక జీడిమామిడి పరిశ్రమకు సంబంధించి చిత్తూరు జిల్లాలో ఉన్న నాలుగు పరిశ్రమలు అందులో ప్రధానంగా తవణంపల్లి మండలం లోని పట్టణం సమీపంలో గల పరిశ్రమలో సుమారు వెయ్యి మంది పనిచేస్తారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ పరిశ్రమలో 300 మందికి అనుమతినిచ్చారు కానీ ఫ్యాక్టరీ యాజమాన్యం 100 మందితో ఉత్పత్తిని ప్రారంభించింది జనతా కర్ఫ్యూ నాటికి తయారైన ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడంతోపాటు నూతనంగా ఉత్పత్తులు చేసుకునేందుకు అవకాశం ఉందని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని నియమ నిబంధనలను అనుసరిస్తున్నామని వారంటున్నారు


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image