ప్రతి మద్యం షాపును తనిఖీ    చేస్తాం.   :మద్య విమోచన ప్రచారకమిటీ చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి

 


   ప్రతి మద్యం షాపును తనిఖీ
   చేస్తాం.
          -మద్య విమోచన ప్రచారకమిటీ 


   గుంటూరు, ఏప్రిల్,13 (అంతిమ తీర్పు ):     మార్చి 22 నుండి సీలు వేసి మూసివేసిన 3500 ప్రభుత్వ మద్యం షాపులను, 800లకు పైగా వున్న బార్ మరియు రెస్టారెంట్ లను తనిఖీలు చేసి అక్రమంగా మద్యం తరలించి వుoటే సంబంధిత సూపర్ వైజర్, సేల్స్ మెన్ లతో పాటు బార్ యజమానులు,  సంబంధిత అధికారులపై సత్వర చర్యలు చేపడుతామని      మద్య విమోచన ప్రచార కమిటీ   చైర్మన్    వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి అన్నారు. గుంటూరు లో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ     మార్చి 22న సీలు వేసిన సమయానికి వున్న మద్యం నిల్వలు తనిఖీలు చేసిన సందర్భంగా వున్న మద్యం నిల్వలలో ఏమాత్రం తేడా వచ్చినా కఠినంగా శిక్షిస్తాం.ఈ  తనిఖీల నిర్వహణ కోసం ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్,  పోలీస్,  మద్యం డిపోల సిబ్బందితో కూడిన టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేయడమైనది. కొంతమంది స్వార్థపరులు అక్కడక్కడా మద్యం షాపులు,  బార్ మరియు రెస్టారెంట్ ల  నుండి అక్రమంగా మద్యం తరలించినట్లు మా  దృష్టికి వచ్చింది. ప్రజా ప్రతినిధులు ఎవ్వరూ అక్రమ మద్యం కార్యకలాపాలను ప్రోత్సహించ వద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. ఏ స్థాయిలో ఉన్న ప్రజా ప్రతినిధి అయినా  అక్రమ మద్యాన్ని ప్రోత్సహిస్తే ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్  రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్తాం. ముఖ్యమంత్రి దృఢసంకల్పమైన  దశలవారీ మద్య నిషేధానికి ఎవ్వరూ తూట్లు పొడవాలని చూసినా సహించేది లేదు. రాజకీయ జోక్యం ఏ మాత్రం ఉండరాదని కోరుతున్నాం. లాక్ డౌన్ ప్రకటించిన మార్చి 22 నుండి ఏప్రిల్ 12 వరకు ఆంధ్రప్రదేశ్ లో ని 13 జిల్లాలలో 2178 అక్రమ మద్యం కేసులు నమోదు కాగా 22 13 మందిని అరెస్టు చేయడమైనది. 16405 లీటర్ల నాటుసారా ను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేయడం జరిగింది. 3, 61, 500 లీటర్ల   పులిసిన బెల్లం ఊటను ధ్వంసం చేశారు. మన రాష్ట్రానికి సంబంధించిన 1976 లీటర్ల మద్యం ను,  1500 లీటర్ల బీర్ బాటిల్స్ ల  ను స్వాధీనం చేసుకున్నారు.
 ఇతర రాష్ట్రాల నుండి తరలిస్తున్న 1420 లీటర్ల మద్యంను స్వాధీనం చేసుకున్నారు. 3000 లీటర్ల కల్లును పట్టుకున్నారు. అక్రమ మద్యాన్ని రవాణా చేస్తున్న 464 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. లాక్ డౌన్ లో సహితం కృషి చేసి అక్రమార్కులను పట్టుకున్న ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్  సిబ్బందిని అభినందిస్తున్నాము. 


    తెలంగాణ రాష్ట్రంలో కల్తీ కల్లు అత్యధికంగా వినియోగించడం వలన ప్రస్తుతం విత్ డ్రాయల్ లక్షణాలు ఎక్కువగా వచ్చి  వందలాదిమంది ఆస్పత్రుల పాలౌతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కల్తీకల్లు లేనందున ఆ పరిస్థితి లేదు. ఎవరికైనా వ్యసనపరులకు విత్ డ్రాయల్ లక్షణాలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న డీ-అడిక్షన్ కేంద్రాలను సంప్రదించగలరు. గుంటూరులోని న్యూ లైఫ్ డి- అడిక్షన్ కేంద్రం వారు ఉచితంగా వైద్యాన్ని అందిస్తారు. 9849347500 నెంబరును  సంప్రదించగలరు. అక్రమ మద్యానికి  సంబంధించి  ఫిర్యాదులను14500 మరియు 18004254868 టోల్ ఫ్రీ నెంబర్లకు ఇవ్వగలరు. మీడియా సమావేశంలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాస్, ఎక్సైజ్ సూపరిండెంట్స్ ఎన్.బాలకృష్ణన్, ఎస్. రవికుమార్, సి. హెచ్. వి మహేష్ కుమార్ లతో పాటు ఎపిబ్రివరేజ్ కార్పొరేషన్స్ డిపో మేనేజర్లు పాల్గొన్నారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..