ఇంటింటికి మన్నేటి కూరగాయలు సరఫరా

3 టన్నుల కూరగాయలను కొండాయపాళెం పంచాయితీకి తరలించి ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. 1000 కుటుంబాలకు కూరగాయలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మన్నేటి.వెంకటరెడ్డి తెలియజేశారు. శుక్రవారం ప్రారంభించిన ఈ కూరగాయల పంపిణీని శనివారం, ఆదివారాలలో కూడా కొనసాగిస్తామన్నారు. ఈ విపత్కర పరిస్థితులలో ప్రజల అవసరాలు తీర్చేందుకు దాతలు స్వచ్చందంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. వాద వాడలా సేవా కార్యక్రమాలను విస్తరింపజేయాల్సిన ఆవశ్యకత ప్రస్తుత కరోనా కర్ఫ్యూ పరిస్థితులలో ఎంతైనా ఉందన్నారు. మన ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు సేవలందించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటామని మన్నేటి.వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మన ఫౌండేషన్ సేవలపై ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.