సోమశిల జలాశయం నుంచి ఆత్మకూరు నియోజకవర్గ ప్రాంతాలకు రెండవ పంటకు నీరందించేందుకు ఏర్పాట్లు : మంత్రి మేకపాటి

  సోమశిల / శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా :


*అన్నదాతకు అండగా ఉండే రైతు ప్రభుత్వం మనది : పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.రైతన్నలకు సాగునీరందించడమే లక్ష్యంగా సాగిన మంత్రి గౌతమ్ రెడ్డి పర్యటన.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రైతుల తర్వాతే ఎవరైనా.సోమశిల జలాశయం, నియోజకవర్గంలోని మండలాలలో ఉన్న చెరువుల పరిశీలన.సోమశిల జలాశయాన్ని సందర్శించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.రెండో పంటకు సాగునీటి ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశంతాగునీటికి కూడా ఢోకా లేదు : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.చేజర్ల చెరువును పరిశీలించిన మంత్రి మేకపాటి.అనంతసాగరం మండలంలోని పడమటి కంభంపాడు నల్లచెరువులూ పరిశీలన.అనుమసముద్రంపేటలోని చిరమన చెరువును పరిశీలించిన మంత్రి.మండల హెడ్ క్వార్టర్ లో లాక్ డౌన్ అమలు తీరుపై వివరాలు తెలుసుకున్న మంత్రి మేకపాటి.చెరువుల మరమ్మతులు, ఇతర పరిస్థితులపై మంత్రి మేకపాటి ఆరా.లాక్  డౌన్ ఉన్నా వ్యవసాయం, పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.లాక్ డౌన్ ను జీవనంలో భాగం చేసుకోవాలి, అందరి భవిష్యత్ కోసమే లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ వ్యవసాయ పనులు చేసుకోవడం అన్నదాతల బాధ్యత.రైతులకు ఎటువంటి సమస్య వచ్చినా ఆదుకునే రైతు ప్రభుత్వం మనది.సోమశిల జలాశయం నుంచి ఆత్మకూరు నియోజకవర్గ ప్రాంతాలకు రెండవ పంటకు నీరందించేందుకు ఏర్పాట్లు.సాగు నీటి విడుదల సామర్థ్యం, తాగునీటి అవసరాలపై జలవనరుల శాఖ అధికారులతో చర్చించిన మంత్రి మేకపాటి.ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల, అనంతసాగరం మండలాలలో పర్యటించిన మంత్రి. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులు, పారిశుద్ధ్య పనులు జరుగుతున్న తీరుపై ఆరా.వరి కొనుగోలు కేంద్రంలో ఎదురవుతున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన అనంతసాగరం మండల నాయకులు పారిశుద్ధ్య పనులు నిత్యం సక్రమంగా జరిగేలా చూడాలని మండల అధికారులకు ఆదేశం.ప్రజలకు అవగాహన పెంచడంతో పాటు, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచన. ఆత్మకూరు ఆర్డీవో ఉమాదేవి , ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేశ్ బాబులకు శానిటైజర్లు, మాస్కులు అందించిన మంత్రి.గత పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు ఆత్మకూరు మార్కెట్ వ్యాపారులకు అందజేసిన మంత్రి.మంత్రి  శాఖల్లో ఒకటైన ఆప్కో ద్వారా, ఖాదీతో తయారైన నాణ్యమైన మాస్కులను అందజేసిన మంత్రి, శానిటైజర్లూ పంపిణీ.పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల అధికారులు విధినిర్వహణతో ఆరోగ్యంపైనా శ్రద్ధ వహించాలని మంత్రి సూచన.కరోనా విపత్తు సమయంలో మీ సేవలను సమాజం మర్చిపోదని మంత్రి ప్రశంసలు.ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో ఇప్పటికే మంత్రి మేకపాటి ముందస్తు జాగ్రత్తలు .మంత్రి పర్యటనలో పాల్గొన్న సోమశిల ప్రాజెక్టు ఎస్.ఈ రవీందర్ రెడ్డి, డీ.ఈ సత్య ప్రసాద్ , ఇతర ఇరిగేషన్ అధికారులు, సీ.ఐ పాపారావు, మండలస్థాయి స్థానిక వైసీపీ నాయకులు.