గూడూరు జర్నలిస్ట్ లకు కోట సునీల్ కుమార్ స్వామి నిత్యావసర వస్తువులు వితరణ

*గూడూరు✍️: విపత్కర పరిస్థితుల్లో, కష్ట కాలంలో ఆపద్బాంధవుడిగా అందరిని అదుకునే  హిందూ ధర్మ పరిరక్షణ జిల్లా కోర్దినేటర్ కోట సునీల్ కుమార్ స్వామి కరోనా లాక్  డౌన్ లో ప్రభుత్వానికి ప్రజలకు వారధి లా పనిచేస్తున్న జర్నలిస్టులకు అండగా నిలిచి ఒక్కక్క జర్నలిస్ట్ కు 10 కేజీల నాణ్యమైన బియ్యంతో 20 నిత్యావసర వస్తువుల తో  ఒక్క కిట్ రూపంలో  శుక్రవారం గూడూరు పట్టణంలోనీ కటక రాజవారి వీధిలో ఉన్న ప్రెస్ క్లబ్ లో 70 మంది  జర్నలిస్టులకు ఒకొక్కరికి ఒక్కో కిట్ ను కోట సునీల్ కుమార్ స్వామి చేతులు మీదుగా అందజేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారినీ కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో  ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం, దుకాణాలు మూసివేయడంతో  దుకాణాల వద్ద ఉండే యాచకలు ఇబ్బందులు పడుతున్నప్పుడు తాను వారి పరిస్థితి గమనించి ఆహార పొట్లాలు అందించి వారి ఆకలి తీర్చమన్నారు, రోజు 250 ఆహార పొట్లాలు అందిస్తున్నాము అని ఆయన తెలిపారు, కరోనా లాక్ డౌన్ లో అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టుల సేవలు స్ఫూర్తి దాయకం అన్నారు,  ఈ నేల 5 వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన దీపము వెలిగించే కార్యక్రమాని విజయమంతం చేద్దాం అనీ ఆయన పిలుపునిచ్చారు, ప్రతి ఒక్కరూ అదివారం రాత్రి 9 గంటలకు ఇంటి బాల్కని, ఇంటి గుమ్మం ముందర దీపం, కొవ్వుతులు, సెల్ లైటు వేసి తమ సంఘిభావం తెలియజేయాలని ఆయన కోరారు, దేశ వ్యాప్తంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం సేవలు స్ఫూర్తి దాయకం అన్నారు, అదేవిధంగా పట్టణంలోనీ స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు తనతో కలిసి ప్రజలకు సేవ చేయడం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు, ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్ ప్రతినిధులు పూర్ణ, ప్రసాద్ రెడ్డి, ఆశ్రయా ఫౌండేషన్ చైర్మన్ చంద్రన్నిల్, ఏబివిపి రాష్ట్ర సభ్యులు మనోజ్ కుమార్, జిల్లా కార్యదర్శి దొర బాబు,  పవన్ ఫ్యాన్స్స్ గూడూరు అధ్యక్షుడు చంద్ర మరియు జర్నలిస్టులు తదితరులు ఉన్నారు,*


Popular posts
కేసులు ఉపసంహరించుకోవాలి:తంగిరాల సౌమ్య
ఒరిస్సా వలస కూలీలకు నిత్యావసరాల పంపిణీ చేసిన సక్షమ్ 
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఉప రాష్ట్రపతి కి నిమ్మరాజు చలపతిరావు సన్మానం
మే 3 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ : మోడీ