రంజాన్ నిబంధనలు ప్రకారం జరుపుకొండి: అమలాపురం డీఎస్పీ మాసూమ్ భాషా 

రంజాన్ నిబంధనలు ప్రకారం జరుపుకొండి:డీఎస్పీ మాసూమ్ భాషా 
అమలాపురం :. డీఎస్పీ మాసూమ్ భాషా 
 నిబంధనలకు అనుగుణంగా రంజాన్ నిర్వహించు కోవాలని డీఎస్పీ మాసూమ్ భాషా అన్నారు. 
రాజోలు సర్కిల్ పరిధిలో ఉన్న నాలుగు పోలీస్ స్టేషన్ ల పరిధిలో ఉన్న  ముస్లిం పెద్దలతో  నగరం  పోలీస్ స్టేషన్ లో  డిఎస్పీ మాసూమ్ భాషా  సమావేశం నిర్వహించారు. రంజాన్ మాసాన్ని  ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో నిబంధనలు పాటిస్తూ చేసుకోవడం  సమాజం కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉపవాసాలు,మరియు నమాజులు చేసుకోవడం మన కర్తవ్యం అని డీఎస్పీ అన్నారు. అదే విధంగా నమాజులు ప్రార్ధనలు అందరూ తమ ఇళ్ళల్లోనే చేసుకోవాలని మీకు ఎటువంటి సమస్య వచ్చిన  పరిష్కరించే దిశలో ప్రభుత్వం ముందుందన్నారు.అదే విధంగా సోషల్ మీడియా లో ముస్లిం లను కించపరిచే విధంగా పోస్ట్ లు "ఫేక్ వీడియో"లు పెట్టే వారికి కఠిన శిక్షలు ఉంటాయని తెలియచేసారు. మే 3 తర్వాత పరిస్థితులను బట్టి ఆంక్షల సడలింపును కమిటీలకు తెలియచేస్తానని తెలిపారు.
మనందరం చాలా క్లిష్ట పరిస్థితులలో ఉన్నామని అందువలన అందరూ ప్రభుత్వానికి సహకరిస్తూ ఈ పవిత్ర రంజాన్ మాసాన్ని ఆచరించాలని కోరారు.
. ప్రతి మస్జీద్ లో ఆజాన్ ఇచ్చుటకు మరియు ఉపవాస సైరన్ మ్రోగించుటకు పర్మిషన్ ఇచ్చామన్నారు. 
 ప్రతి మస్జీద్ లో ఇమామ్,మౌజన్ మరియు ఇంకొకరికి మాత్రమే పర్మిషన్ ఇచ్చామని అమలాపురం DSP  మాసూమ్ భాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజోలు CI దుర్గా శేఖర్ రెడ్డి,  నగరం SI సతీష్ పాల్గొన్నారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image