కరోనా నివారణకు  ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి -   మంత్రి పేర్ని నాని    

 


      
కరోనా నివారణకు  ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి !!
                                           --- మంత్రి పేర్ని నాని              


మచిలీపట్నం : ఏప్రిల్ 27 ,  (అంతిమ తీర్పు) :     తప్పక స్వీయ నియంత్రణ పాటించాలని, వేరే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని ,  వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ  కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా  వ్యవహరించాలని రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) సూచించారు. 
                                 సోమవారం ఉదయం మంత్రి పేర్ని నాని స్థానిక మల్కాపట్నం లోని లెమన్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ చర్చి లో 300 మందికి నిత్య వాసరాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  ఆపదలో ఉన్నవారికి అండగా ఉండేందుకు పెద్ద మనసుతో నిలిచిన విజయవాడకు చెందిన వర్షా కన్స్ట్రక్షన్ అండ్ డెవొలెపెర్స్ సంస్థ అధినేత దొడ్డాకుల పొన్నారికు ఆ దేవుని దీవెనలు మెండుగా ఉండాలని అభిలషించారు.  విజయవాడ సిటీ లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న వేళ ఆ నగరానికి కొద్ది దూరంలో ఉన్న మనం ఎంతో అప్రమత్తతగా ఉండాలంన్నారు. మచిలీపట్నంలో మరో పాజిటివ్ కేసు నమోదైందని దీంతో బందరులో నాల్గవ కేసుగా నమోదైన వ్యక్తి విజయవాడలో పోలీస్ గా ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్నాడని  నిత్యం డైలీ సర్వీస్ అటూ ఇటూ తిరుగుతుంటాడని మంత్రి పేర్ని నాని తెలిపారు.  ఆ ఉద్యోగి వలన టౌన్ లో ఎంతమంది పాజిటివ్ లుగా మారతారో అన్న ఆందోళన వేధిస్తుందన్నారు. లాక్ డౌన్ వేళ ప్రజలు ఇష్టం వచ్చినట్లు బయటికి రాకూడదని వేరే ఊళ్లకు వెళ్లకూడదన్నరు. తప్పని పరిస్థితులలో వెలుపలికి వచ్చినా ఏ ఒక్కరిని తాకకూడదని సూచించారు.  సబ్బుతో చేతులను శుభ్రంగా కడగాలన్నారు.  ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడం పట్ల అధికారులు, పోలీస్ యంత్రాగం, ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందన్నారు .  
      ఈ  నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో  ఎల్ ఈ ఎఫ్ చర్చి సంఘకాపరి  తంటేపూడి ప్రభాకర్  దొడ్డాకుల స్వరూప, రాజకుమార్,19 వ డివిజన్ పార్టీ ఇంచార్జ్ బూరగ రామారావు, పాండే, డ్రైవర్ నాని తదితరులు పాల్గొన్నారు