దయచేసి ఎవ్వరూ కూడా అనవసరంగా బయటకు రావద్దు : ఎమ్మెల్యే  విజ్ఞప్తి

దయచేసి ఎవ్వరూ కూడా అనవసరంగా బయటకు రావద్దు : ఎమ్మెల్యే  విజ్ఞప్తి
మంత్రాలయం,ఏప్రిల్, 18 (అంతిమతీర్పు):- మంత్రాలయం నియోజకవర్గం ప్రాంత ప్రజలు ఎవ్వరు కూడా దయచేసి బయటకు రావద్దని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగీరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రాఘవేంద్ర సర్కిల్ లో యూపీఎల్ కంపెనీ వారి తరఫున జిల్లా అధ్యక్షులు అశోక్ ఆనంద్ రెడ్డి, మండల ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణ రెడ్డి ఏర్పాటు చేయించిన ప్రత్యేక మిషన్ ద్వారా పిచికారి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి రోజు, రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో చుట్టుప్రక్కల మండల, గ్రామీణ ప్రాంత ప్రజలు  అత్యవసరమైతే తప్పా,ఎవరు కూడా అనవసరంగా  బయటకు రాకూడదనిఅధికారులు సూచించిన ఆదేశాలను తప్పకుండా పాటించాలనివారు కోరారు.అనంతరంరెవెన్యూ,వైద్య,పంచాయతీకార్యదర్శులకి యు పి ఎల్ వారి కంపెనీ తరపున హెల్మెట్ లను అందజేశారు. అనంతరం యూపీఎల్ కంపెనీ వారికి మండల అధికారులు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు వై. ప్రదీపురెడ్డి, మండలాధ్యక్షుడు జి. భీమిరెడ్డి, ఇన్ చార్జ్ విశ్వనాథ్ రెడ్డి, నాయకులు రాఘవేంద్ర రెడ్డి తహసీల్దార్ చంద్ర శేఖర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సుబ్బరాయుడు, ఈవోపీఆర్డి నాగేష్, ఎస్ఐ ఎర్రన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి, మాజీ సర్పంచ్ టి.భీమయ్య, ఎంపిటిసి సభ్యులు రాఘవేంద్ర, వెంకటేష్ శెట్టి తదితరులు పాల్గొన్నారు.