మద్యం అక్రమాలకు పాల్పడితే కఠినచర్యలు : మంత్రి నారాయణస్వామి సీరియస్‌

*07.04.2020*
*అమరావతి*


*మద్యం అక్రమ అమ్మకాలపై ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీ నారాయణస్వామి సీరియస్‌*


*మద్యం అక్రమాలకు పాల్పడితే కఠినచర్యలు*


*సరిహద్దు జిల్లాల్లో చెక్‌పోస్ట్‌లలో మరింత నిఘాపెట్టాలని అధికారులకు ఆదేశాలు*


*మద్యం అక్రమ అమ్మకాలకు సహకరిస్తున్న ఎవరినీ కూడా ఉపేక్షించేది లేదు*


*తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు*


*లాక్‌డౌన్‌ సమయంలో మద్యం విక్రయిస్తే టోల్‌ ఫ్రీ నెంబర్లకు సమాచారమివ్వండి*


*టోల్‌ ఫ్రీ నెంబర్లు 18004254868, 94910 30853, 0866 2843131*


*మద్యం అమ్మకాలపై కొనసాగుతున్న నిషేదం*


కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించి, మద్యం అమ్మకాలను  నిషేధించింది. దీంతోపాటు అనధికారికంగా మత్తు పదార్ధాల విక్రయాలు జరిపినా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరించినా చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌శాఖా మంత్రి శ్రీ నారాయణస్వామి తెలిపారు. వివిధ జిల్లాల్లో మద్యం అక్రమ అమ్మకాలు జరుగుతున్నట్లు వచ్చిన వార్తలపై ఆయన సీరియస్‌ అయ్యారు. అక్రమ అమ్మకాలకు సహకరిస్తున్న ఎవరినీ కూడా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. ఇప్పటికే అన్ని బార్లు, మద్యం షాపుల్లో స్టాక్‌ను తనిఖీ చేసి, మళ్ళీ అమ్మకాలు ప్రారంభించిన తర్వాత ఓపెనింగ్‌ స్టాక్‌కు ఇప్పటి క్లోజింగ్‌ స్టాక్‌ సరిగా ఉందో లేదో వెరిఫై చేయాలని ఎక్సైజ్‌ సిబ్బందిని ఆదేశించారు. ఎక్సైజ్ అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని...ఏపీ సరిహద్దు జిల్లాల్లో చెక్‌పోస్ట్‌లలో మరింత కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటుచేయాలన్నారు.


ఇప్పటికే సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ మ్యానిఫెస్టోలో చెప్పినట్లు మద్యపాన నిషేదంలో భాగంగా దశలవారీ మద్యపాన నిషేదాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు. గత ఏడాది అక్టోబర్‌ 1 నుంచి ఈ దశలవారీ మద్యపాన నిషేదం రాష్ట్రంలో అమలవుతుందన్న మంత్రి...లాక్‌డౌన్‌ కారణంగా ప్రభుత్వానికి ప్రతీరోజూ కొన్ని కోట్ల రూపాయల నష్టం వస్తున్నా ప్రజారోగ్యం ముఖ్యమనే ఉద్దేశంతో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో మద్యం అమ్మకాలను నిషేదించారన్నారు. దీనికి కూడా తూట్లుపొడుస్తూ కొంతమంది టీడీపీ అనుకూల బార్‌ ఓనర్లు కొన్ని చోట్ల బార్ల నుంచి మద్యాన్ని బయటికి తీసుకొచ్చి విపరీతమైన ధరలకు విక్రయిస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని...దీంతో వెంటనే ఆ బార్ల లైసెన్స్‌ సస్పెండ్‌ చేయాలని ఆదేశించామన్నారు. ఉదాహరణగా చిత్తూరులో టీడీపీకి చెందిన భాస్కర్‌ నాయుడు రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడంతో లైసెన్స్‌ సస్పెండ్‌ చేశామన్నారు. ఈ విషయంలో అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు.


*మద్యం విక్రయిస్తే టోల్‌ఫ్రీ నెంబర్లకు సమాచారమివ్వండి*


ఎవరైనా మద్యం విక్రయిస్తే టోల్‌ఫ్రీ నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని మంత్రి శ్రీ నారాయణస్వామి మరోసారి ప్రజలకు సూచించారు. టోల్‌ ఫ్రీ నెంబర్లు 18004254868, 94910 30853, 0866 2843131. మత్తుకు బానిసలైన కొంతమంది సహనం కోల్పోయి హానికర ద్రవాలు సేవించి ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని ఆయన అన్నారు. వారి విషయంలో కుటుంబసభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. టోల్‌ఫ్రీ నెంబర్లకు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని, ఈ నెంబర్లు 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు


Popular posts
కేసులు ఉపసంహరించుకోవాలి:తంగిరాల సౌమ్య
ఒరిస్సా వలస కూలీలకు నిత్యావసరాల పంపిణీ చేసిన సక్షమ్ 
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఉప రాష్ట్రపతి కి నిమ్మరాజు చలపతిరావు సన్మానం
మే 3 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ : మోడీ