వై.యస్.ఆర్.సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించి, చెక్కు ఆవిష్కరించిన మంత్రి శంకరనారాయణ

వై.యస్.ఆర్.సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించి, చెక్కు ఆవిష్కరించిన మంత్రి శంకరనారాయణ
*విపత్తు సమయంలో మహిళల కొండంత అండగా రాష్ట్ర ప్రభుత్వం*
పెనుకొండ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాద యాత్రలో ఇచ్చిన హామి ప్రకారం రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘ మహిళలకు అండగా నిలుస్తూ సున్న వడ్డీకే రుణాలు ఇస్తున్నారని, ఇంతటి గొప్ప కార్యక్రమం ప్రస్థుత గట్టు పరిస్థితుల్లో కూడ అక్క చెల్లెల్లకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  శ్రమిస్తున్నారని మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం పెనుకొండ పట్టణ ఎంపిడిఓ ఆఫిస్ వెనుక ఉన్న వెలుగు కార్యాలయం నందు "వై.యస్.ఆర్.సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించి, చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అథిదిగా రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ మాలగూండ్ల శంకరనారాయణ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెనుకొండ నియోజకవర్గానికి సంబంధించి మంజూరైన 10 కోట్ల 77 లక్షల విలువగల గ్రాండ్ చెక్కును ఆవిష్కరించారు. అనంతరం మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో మహిళలకు మాట ఇచ్చిన ప్రకారం సున్నా వడ్డీకే బ్యాంకు రుణాలు అందించడానికి శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా అప్పు నిల్వ కలిగిన స్వయం సహాయక సంఘాల బ్యాంకు విధించిన వడ్డీ రేటు ప్రకారం, వడ్డీ మొత్తాన్ని నేరుగా స్వయం సహాయక సంఘాల అప్పు ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు అర్హత కలిగిన ఎనిమిది లక్షల 78 వేల స్వయం సహాయక సంఘాలకు 1,400 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అనంతపురం జిల్లాకు సంబంధించి 65 వేల 37 (రూరల్ 51,491; అర్భన్ 13,546) స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని ఈ సంఘాల సభ్యులకు 135.62 కోట్లు వడ్డీ మొత్తం మంజూరు జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించిన 5064 స్వయం  సహాయక సంఘాలకు  10 కోట్ల 77 లక్షల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను అధిగమిస్తూ ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పేద ప్రజల అభ్యున్నతిని ఆకాంక్షించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మహిళల పక్షాన నిలుస్తూ ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి వి పేర్కొన్నారు. గత 11 నెలల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మానిఫెష్టోలో పొందుపరచిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ పెన్షన్లు, అమ్మ ఒడి, కంటి వెలుగు, నేతన్న నేస్తం, ఆరోగ్యశ్రీ,  వాహన మిత్ర, వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలిచిందని మంత్రి అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా నిలుస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను అమలుపరుస్తూ ముందుకు సాగుతున్నారని రానున్న రోజుల్లో కూడా పేదల పక్షపాతి వైఎస్సార్ సిపి ప్రభుత్వం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజలు, మహిళలు, ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల సభ్యులు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి అండగా నిలవాలని, జగనన్న చేపడుతున్న మంచి కార్యక్రమాలకు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జిల్లాలో కరోనా వ్యాధి వ్యాపిస్తున్న నేపథ్యంలో మహిళలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని బయటకు వచ్చినప్పుడు సామాజిక దూరం పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నియమాలను అనుసరిస్తూ కరోనాని తరిమికొట్టేందుకు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శివ శంకరప్ప,  ఎఈ రమణప్ప వైయస్సార్ సిపి నాయకులు సుధాకర్ రెడ్డి, మండల కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి, పట్టణ కన్వీనర్ తయూబ్, రామ్మోహన్ రెడ్డి, గుంటూరు శ్రీరాములు, నాగూర్ బాబు, స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.