బ్లాక్ డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా అన్నదాతలు

బ్లాక్ డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా అన్నదాతలు,


కౌతాళం,ఏప్రిల్,1(అంతిమతీర్పు):-కర్నూలు జిల్లాలోని కౌతాళం,పెద్దకడబూరు, కోసిగి మండలాల్లో కరోనా వైరస్ వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్లాక్ డౌన్ ప్రకటించడం వల్ల ఆయా గ్రామాల్లోని రైతులు చాలా ఇబ్బందులకు  గురవుతున్నారు. పండించిన పంటలు అమ్ముకోవడానికి వీలు లేక పొలాల్లోనే వదిలిపెట్టినమని అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గ్రామాల్లోని రైతులు పండించిన పంటలైన ఉల్లిగడ్డలు, మిరప, పత్తి, కనకాంబరాలు తదితర పంటలను పంట పొలాల్లోనే  రాసులుగా పోసి కుప్పలు కుప్పలుగా పంట పొలాల్లోనే ఉండడంతో  అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుకోకుండా అకాల వర్షాలు వస్తే రైతులు పండించిన పంట అంతా నీటి పాలవడంతో అన్నదాతలు  సర్వనాశనం అవుతారని రైతు కూలీ సంఘం నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఆయా మండలాల్లోని  అన్నదాతలు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లాఉపాధ్యక్షులు కె. మల్లయ్య డిమాండ్ చేశారు. కాబట్టి ఆయా సంబంధిత మండలాల్లోని  నాయకులు, ప్రభుత్వఅధికారులువెంటనేస్పందించిజిల్లాఅధికారులతో సంప్రదించికౌతాళంమండలంలోకొనుగోలు చేసే విధంగా  కొనుగోలు కేంద్రాలను  ఏర్పాటు చేసి దీని ద్వారా రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వమే చర్యలు తీసుకోని ఆయా గ్రామాల్లోని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పొలాల్లో సగానికి సగం మిగిలిపోయిన పనులను రైతులు తమ తమ పొలాల్లో పనులు చేసుకునే విధంగాఅవకాశం కల్పించాలనిరైతుకూలీసంఘంనాయకులు,అన్నదాతలు కోరుతున్నారు.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
శాసన రాజధాని కుడా అమరావతిలో లేకుండా చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినాని అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల బావిషత్తు "కొడాలి నాని గారికి బుద్ధి రావాలని" ఉద్దండ్రాయునిపాలెంలో నాని గారి దిష్టిబొమ్మని పాడికట్టి శవ యాత్ర చేశారు..
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
ఏప్రిల్11-04-2020-మహాత్మా ఫూలే 193 వ జయంతి కార్యక్రమం సందర్భంగా,
Image