ఎమర్జెన్సీ సేవతోపాటు విపత్తు సమయంలో కుటుంబ పోషణ

*19–04–2020*
*అమరావతి*


*కోవిడ్‌ – నివారణలో ‘స్వయం సహాయక మహిళ’*
*ఎమర్జెన్సీ సేవతోపాటు విపత్తు సమయంలో కుటుంబ పోషణ*
*సీఎం ఆలోచనతో మహిళలకు ఉపాథి*
*మాస్క్‌కు రూ. 3.5చొప్పున స్వయం సహాయక మహిళకు రోజుకు రూ.500లకు పైనే ఆదాయం*
*రెడ్‌జోన్లలో మాస్క్‌ల పంపిణీ ప్రారంభం*
*త్వరలో మిగతా ప్రాంతాలకూ...*
*ఆదివారం మ. 3 గంటలవరకూ 7.28 లక్షల మాస్కుల తయారీ*
*4–5 రోజుల్లో రోజుకు సుమారు 30 లక్షలు తయారీ*
*మెప్మా, సెర్ప్‌ ఆధ్వర్యంలో చురుగ్గా కార్యక్రమాలు*
*తన నివాసంలో ఇవాళ మాస్క్‌లను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌*


అమరావతి: ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ఆలోచన కరోనా వైరస్‌నుంచి ప్రజలను రక్షించే చర్యలు బలోపేతం అవ్వడమే కాకుండా, విపత్తు కాలంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధినిస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు చొప్పున 16 కోట్ల మాస్కులు పంపిణీచేయాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం కారణంగా... విపత్కర పరిస్థితుల్లోనూ మహిళలు తమ కుటుంబాలను పోషించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. స్వయం సహాయక సంఘాలు తయారుచేసిన మాస్క్‌లను సీఎం తన నివాసంలో ప్రారంభించారు. మహిళలు తయారుచేసిన మాస్క్‌లను మెప్మా అధికారులు సీఎంకు అందజేశారు. 


కోవిడ్‌ నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రప్రజలకు ప్రతి ఒక్కరికి మూడు చొప్పున మాస్కులు పంపిణీచేయాలని సీఎం నిర్ణయించారు. వైరస్‌ వ్యాప్తి నివారణా చర్యల్లో భాగంగా ఈ మాస్కులు ఇవ్వాలని సీఎం నిశ్చయించారు. మాస్క్‌ల తయారీని కాంట్రాక్టర్లకు అప్పగించకుండా నేరుగా స్వయం సహాయక సంఘాల్లోని అక్కచెల్లెమ్మలకు అప్పగించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీనికి అవసరమైన క్లాత్‌ను ఆప్కోనుంచి సేకరించాలని అధికారులు నిర్ణయించారు. మొత్తం 16 కోట్ల మాస్కులు తయారుచేయడానికి 1 కోటి 50 లక్షల మీటర్లకుపైగా క్లాత్‌ అవసరం అవుతోంది. 
ఇప్పటికే 20 లక్షలకు పైగా మీటర్ల క్లాత్‌ను ఆప్కోనుంచి తీసుకున్నారు. మిగతా క్లాత్‌ త్వరలోనే అందబోతోంది.


స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో దాదాపు 40వేల మంది టైలర్లను గుర్తించారు. యుద్ధప్రాతిపదికన వారితో పనిచేయిస్తున్నారు. ఒక్కో మాస్క్‌కు దాదాపు రూ.3.50 చొప్పున సుమారు రూ.500లకుపైనే ప్రతి మహిళకూ ఆదాయం లభించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నాటికి 7,28,201 మాస్క్‌లు తయారుచేయగా వీటిని పంపిణీకోసం తరలిస్తున్నారు. వచ్చే 4–5 రోజుల్లో రోజుకు 30 లక్షల చొప్పున మాస్క్‌లు తయారీకోసం సన్నద్ధమవుతున్నారు. మాస్క్‌ల తయారీ, పంపిణీలపై వివరాలతో కూడా రియల్‌టైం డేటాను ఆన్‌లైన్లో పెడుతున్నారు.
స్వయంసహాయక సంఘాలు తయారుచేసిన ఈ మాస్క్‌లను సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన నివాసంలో ప్రారంభించారు. సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, మెప్మా మిషన్‌ డైరెక్టర్‌ నవీన్‌కుమార్, అడిషనల్‌ డైరెక్టర్‌ శివపార్వతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
శాసన రాజధాని కుడా అమరావతిలో లేకుండా చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినాని అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల బావిషత్తు "కొడాలి నాని గారికి బుద్ధి రావాలని" ఉద్దండ్రాయునిపాలెంలో నాని గారి దిష్టిబొమ్మని పాడికట్టి శవ యాత్ర చేశారు..
Image
పేదల సొంతింటి కల సాకారానికి శ్రీకారం
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం