పరీక్షల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోవాలి : సీఎం

అమరావతి


అమరావతి: కోవిడ్‌–19 నివారణా చర్యలపై సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్ష
కోవిడ్‌–19 పరీక్షల సంఖ్య బాగా పెరిగిందన్న సీఎం
అధికారులను అభినందించిన సీఎం
పరీక్షల విషయంలో వెనకడుగు వద్దన్న సీఎం
పరీక్షల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోవాలి : సీఎం


నిన్న ఒక్కరోజే 6,520 ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేశామన్న అధికారులు
మొత్తంగా ఇప్పటివరకూ 48,034 పరీక్షలు చేశామన్న అధికారులు
ప్రతి మిలియన్‌కు 961 టెస్టులతో దేశంలోనే తొలి స్థానంలో రాష్ట్రం
రానున్న రోజుల్లో మరిన్ని పరీక్షలతో మరింత మెరుగుపడతామన్న అధికారులు


కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్‌ టెస్టు కిట్స్‌కు ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చిందని తెలిపిన అధికారులు
నిర్దేశించిన ప్రోటోకాల్‌ ప్రకారం ర్యాపిడ్‌ టెస్టు కిట్స్‌తో పరీక్షలు జరుగుతాయన్న అధికారులు
ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్స్‌తో ఇప్పటివరకూ 14,423 పరీక్షలు
11,543 టెస్టులు రెడ్‌జోన్లలోనే 
ఈ మొత్తం పరీక్షల్లో సుమారు 30కిపైగా పాజిటివ్‌లు ర్యాండమ్‌ కిట్లలో వచ్చాయన్న అధికారులు
వీటిని నిర్ధారణకోసం పీసీఆర్‌ టెస్టులకు పంపుతున్నామన్న  అధికారులు
కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్‌ టెస్టు కిట్ల పనితీరు బాగుందన్న అధికారులు


టెలిమెడిసిన్‌ ద్వారా వైద్య సలహా తీసుకున్న వారికి మందులు కూడా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్న అధికారులు
సింగపూర్,  చైనాల్లో మరోసారి వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైందన్న అధికారులు


జులైలో మరో సర్వే


తలసేమియా, క్యాన్సర్, డయాలసిస్‌ లాంటి వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం
వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని ఆదేశం
104కు కాల్‌చేస్తే వెంటనే స్పందించేలా ఉండాలన్న సీఎం
ఎమర్జెన్సీ కేసులకు ఇబ్బంది రాకుండా చూడాలన్న సీఎం
డెలివరీ కేసులకు ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించిన సీఎం
ప్రతిపాదిత కొత్త మెడికల్‌ కాలేజీలకు వెంటనేస్థలాలను గుర్తించాలని ఆదేశం


ఎవరికి ఏ సమస్య ఉన్నా 1902కు కాల్‌ చేయండి: సీఎం
గ్రామాల్లోని రైతులు అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ను సంప్రదించాలి: సీఎం
అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ద్వారా పంటలు పరిస్థితులు,  ధరల పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించవచ్చు: సీఎం
ఈ సమాచారం ఆధారంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుంది: సీఎం
 
రూ. 100లకు వివిధ రకాల పండ్లు... ఇవ్వటాన్ని కొనసాగించాలన్న సీఎం
దీన్ని శాశ్వత ప్రాతిపదికన ముందుకు సాగేలా చూడాలన్న సీఎం


తప్పుడు కథనాలపై సమావేశంలో చర్చ :


పత్రికల్లో తప్పుడు కథనాలపై సమావేశంలో చర్చ 
గుంటూరు జిల్లా ఈపూరు మండలంలో బొల్లా వీరాంజనేయలు రొంపిచర్ల మండలం విప్పర్ల రెడ్డిపాలెంలో కర్బూజా పంట పొలంలో వదిలేశారంటూ వచ్చిన కథనంతోపాటు, కడప నుంచి తెప్పించిన అరటి విజయవాడలో రైతుబజార్లకు చేరక కుళ్లిపోతున్నాయంటూ ప్రచురించిన కథనాలపై చర్చ.
ఈరెండూ తప్పుడు సమాచారంగా నివేదించిన అధికారులు
కర్బూజా పంట పండించిన  రైతు కుటుంబంతో మాట్లాడమని నివేదించిన అధికారులు
రెండు కోతలు కోసి పంటను ఇప్పటికే తీసుకున్నామని, గిట్టుబాటు రేటు కూడా తీసుకున్నామని, మూడో కోతలో నాసిరకం కాయలు కారణంగా వదిలేశామని, వాటిని తరలిస్తే రవాణా ఖర్చులు కూడా రావని ఆకుటుంబం తెలిపినట్టుగా చెప్పిన అధికారులు.
విజయవాడలో అరటిగెలలు కూడా కడప నుంచి తెప్పించి, స్థానిక మార్కెట్లకు పంపించామని, అంతేతప్ప వాటిని వదిలేయలేదన్న విషయాన్ని వెల్లడించిన అధికారులు
అలాగే కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారంటూ, అధికారులు అధికారికంగా సమాచారం ఇవ్వకపోయినా ఇష్టం వచ్చినట్టు కేసుల సంఖ్యను, మరణాల సంఖ్యను చూపిస్తున్నారని సమావేశంలో చర్చ .


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..