ఎన్టీఆర్ ట్రస్ట్ ఆద్వర్యంలో  పారిశుద్ధ్య కార్మికులకు SS 96 మాస్కులు  పంపిణీ.

ఎన్టీఆర్ ట్రస్ట్ ఆద్వర్యంలో  పారిశుద్ధ్య కార్మికులకు SS 96 మాస్కులు  పంపిణీ.


    కావలి ఏప్రిల్ 29, (అంతిమ తీర్పు) :  ఎన్టీఆర్ ట్రస్ట్ ఆద్వర్యంలో కావలి మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు SS 96  మాస్కులను పట్టణ టీడీపీ నేతలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అందజేసారు. అనంతరం టీడీపీ సీనియర్ నాయకుడు ఏరియా హస్పటల్ కమిటీ మాజీ చైర్మన్ గుత్తికొండ కిషోర్ మాట్లాడుతూ నారా భువనేశ్వరి సౌజన్యంతో రాష్ర్టంలోని అన్ని మున్సిపాలిటీలకు ,ఆశా వర్కర్లకు , వైద్య సిబ్బందికి , ANM లకు SS 96 మాస్కులను ఎన్టీఆర్ ట్రస్ట్ ఆద్వర్యంలో పంపిణీ చేయటం జరుగుతుందని అందులో బాగంగా కావలి మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు అందజేయటం జరిగిందని తెలిపారు. ఈ మాస్కులను కాటన్ క్లాత్ తో వైద్యుల సలహా మేరకు అత్యున్నత ప్రమాణాలతో తయారు చేయటం జరిగింది అని తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆద్వర్యంలో నారా భువనేశ్వరి మున్సిపాలిటీ కార్మికులకు 375   SS 96 మాస్కులను అందజేయటం మంచి పరిణామం అని వారిని అభినందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాద్యక్షలు మన్నవ రవిచంద్ర, ఉమెన్ అండ్ వెల్పేర్ రీజనల్ మాజీ చైర్ పర్సన్ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, మాజీ కౌన్సిలర్లు కుందుర్తి కిరణ్ ,ఆత్మాకూరు నాగరాజు, సీనియర్ నాయకులు రాజ్ కుమార్ చౌదరి, తటవర్తి వాసు ,మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.