దళితుల రాజకీయ సాధికారతకు జగ్జీవన్ రామ్ కృషి
భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా కూడా వ్యవహరించిన మహనీయుడు జగ్జీవన్ రామ్
మాజీ మంత్రి దేవినేని ఉమా
_విజయవాడ రూరల్ (గొల్లపూడి):- దేశంలో దళితుల రాజకీయ సాధికారతకు కృషి చేసిన మహనీయుడు బాబూ జగ్జీవన్ రామ్ అని, దేశ రాజకీయ యవనికపై జగ్జీవన్ రామ్ చెరగని ముద్రవేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం నాడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని గొల్లపూడి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ తరువాత జగ్జీవన్ రామ్ ఎస్సీ, ఎస్టీల ప్రగతికి చోదకశక్తిలా నిలిచారని చెప్పారు. ఆయన ఐదు దశాబ్దాలు చట్టసభల సభ్యుడుగా, మూడు దశాబ్దాలకు పైగా కేంద్రమంత్రిగా వివిధ కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించారన్నారు. కేంద్ర వ్యవసాయ, ఆహార మంత్రిగా దేశంలో హరిత విప్లవానికి సానుకూల పరిస్థితులు ఏర్పర్చి ఆహార సమస్య పరిష్కారానికి కృషిచేశారన్నారు. జీవితమంతా దేశసేవకు అంకితం చేసి నాలుగు దశాబ్దాలు నవభారత నిర్మాణంలో కీలకపాత్ర పోషించారని ఉమా అన్నారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు దేశంలో అన్ని ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చినప్పుడు ఆ కృషికి సంపూర్ణమద్దతునిచ్చారన్నారు._
*వలస కూలీలకు, నిరుపేదలకు పండ్లు, నిత్యవసరాలు పంపిణీ*
_ఇబ్రహీంపట్నంలో దేవినేని ఉమా రైతుబజార్ మరియు ఏ కాలనీలలో పర్యటించి, కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు వహించాలని స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలకు సూచించారు. అనంతరం కరోనా వైరస్ నియంత్రణ చర్యలలో భాగంగా లాక్‌డౌన్ అమలుతో ఉపాధిని కోల్పోయిన పేద కుటుంబాలకు, వలస కూలీలకు మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, నిత్యవసరాలు ఉచితంగా పంపిణీ చేసారు._