షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ

        నెల్లూరు, ఏప్రిల్ 26 (అంతిమ తీర్పు):             షుమారు 470 మంది వలస కార్మికుల ను బారా షహీద్ దర్గా లో, పొదలకూరు రోడ్ లోని zp స్కూల్ లో ప్రభుత్వం ఉంచింది.  భోజన వసతి కల్పించింది. కానీ వారి వద్ద పేస్ట్, సోప్, షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు లేవు. అందరూ ఒక చోట వున్నారు. జాగ్రత్తలు తీసుకోక పోతే అందరూ కోరానాకు కబళించ బడతారు.  పైన పేర్కొన్న వస్తువులు లేక ప్రమాదానికి చేరువ లో వున్నారు.  మన వాళ్ళు అక్కడికి వెళ్లి అధ్యయనం చేశారు.  వారికి సహాయం చేయవలసిన అవసరం ఉంది. మన మిత్రులందరూ స్పందించి నిరుపేదలై, లాక్ డౌన్  వల్ల ఇంటికి పోలేక, ఉన్న ఊర్లో కూలి  లేని స్థితి లో పొట్ట గడవక అత్యంత కన్నీటి పరిస్థితులలో చిక్కుకు పోయిన మన సోదరులను మనం ఆదుకోవాలి.  Today morning our VRC walker friends contributed  some money to purchase all the essential items like masks, sanitizers, soaps, paste etc and distributed to the migrant laborers at the temporary rehabilitation Centre at BaraShahi Darga at Nellore Lake. Thanks to all those who have voluntarily come forward for this noble cause.  GOD bless you. STAY HOME..STAY SAFE  ~GUDURU Lakshman kumar reddy


Popular posts
*వింజమూరు ప్రజలు జాగ్రత్తలు వహించండి* డాక్టర్ రమేష్.... వింజమూరు, సెప్టెంబర్ 22 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి పట్ల తగు జాగ్రత్తలు వహించాలని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైధ్యాధికారి డాక్టర్ రమేష్ కోరారు. ఇప్పటివరకు మండలంలో 500లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగిందన్నారు. అయితే అదే స్థాయిలో బాధితులు కోలుకుంటుండటం సంతోషకరమైన విషయమన్నారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ వైరస్ పట్ల అవగాహనా రాహిత్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం శ్రేయస్కరం కాదన్నారు. కరోనా నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖలు ఎంతగానో కృషి చేస్తున్నాయన్నారు. అయితే ప్రభుత్వ సూచనలను పెడచెవిన పెట్టడం వలన వైరస్ ప్రబలేందుకు పరోక్షంగా దోహదపడుతున్నామన్నారు. కనీస జాగ్రత్తలు పాటించిన పక్షంలో కరోనాను అంతమొందించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ప్రతి నిత్యం వేడి వేడి ఆహార పదార్ధాలను భుజించడం, దాహం వేసినప్పుడు గోరువెచ్చని నీటిని సేవించడం, యోగా, ముఖానికి మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి సూచనలను ప్రతి ఒక్కరూ విధిగా అలవాటు చేసుకోవాలన్నారు. వైరస్ సోకిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రమేష్ తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.
Image
ఆ నేరస్తుడిని కఠినంగా శిక్షించాలి : సీఎం జగన్‌
16 న చిన్న, మధ్యతరహా పత్రికల రాష్ట్ర మహాసభ : మల్లెల      
చెన్నకేశవ స్వామి ఆలయ ఈవో నారాయణ రెడ్డి మృతి పట్ల మంత్రి సంతాపం
కరోనా నియంత్రణకు దక్కన్ టూబాకో కంపెనీ  గ్రూప్
Image