మల్లాం గ్రామంలో పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ కూరగాయల పంపిణీ

👉 *కష్ట కాలంలో పేదలకు అండగా వైకాపా ...*
👉 *చిట్టమూరు మండలం, మల్లాం గ్రామంలో పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ కూరగాయల పంపిణీ..*
👉 *గ్రామంలోని 2000 కుటుంబాలకు ఉచిత కూరగాయల పంపిణీకి సహకారం అందించిన చిల్లకూరు కోదండరామిరెడ్డి, చిల్లకూరు వెంకు రెడ్డి, చిల్లకూరు సుబ్రహ్మణ్యం రెడ్డి, దువ్వూరు శేషారెడ్డి గార్లు ..*


కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో ఇళ్లల్లో ఆకలితో అలమటించే పేదలు, నిరాశ్రయులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.. ఆ పార్టీ నాయకులు పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి తన తండ్రి పేరుతో స్థాపించిన పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా కరోనా సాయాన్ని కూడా అందించించేందుకు ముందుకొచ్చారు.. గూడూరు నియోజకవర్గ వర్గంలోని అన్ని గ్రామాల్లో తన అనుచర వర్గం ద్వారా ఈ సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు.. ఈ క్రమంలో చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలోని సుమారు 2000 కుటుంబాలకు ఉచితంగా కూరగాయలను అందించారు. ఈ మేరకు చిట్టమూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిల్లకూరు కోదండరామిరెడ్డి, చిల్లకూరు వెంకు రెడ్డి, చిల్లకూరు సుబ్రహ్మణ్యం రెడ్డి, దువ్వూరు శేషారెడ్డి సహాయ సహకారాలతో గ్రామస్తులకు అందించారు.  కరోనా వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను గుర్తి వివరించారు..