వింజమూరు పోలీసులకు భోజనాల ఏర్పాట్లు

వింజమూరు పోలీసులకు భోజనాల ఏర్పాట్లు


వింజమూరు, ఏప్రిల్ 8 (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి): కరోనా వైరస్ నివారణ చర్యలలో భాగంగా ప్రజల సం క్షేమం కోసం అహర్నిశలూ కృషి చేస్తున్న పోలీసులు దైవ సమానులని కలిగిరికి చెందిన రసూల్, వింజమూరుకు చెందిన నీలం.శ్రీనివాసులు అన్నారు. నిత్యం పగలనక రేయనక ప్రజలను కాపాడేందుకు పోలీసులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారన్నారు. ఈ సందర్భంగా తమ వంతు కింకర్తవ్యంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు భోజన ఏర్పాట్లు చేస్తున్నామని వారన్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో పోలీసులు అందిస్తున్న సేవల పట్ల పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్టలు సమాజంలో అమాంతంగా పెరిగిపోయాయని వారు పేర్కొన్నారు.