UTF సేవలు అభినందనీయం : కమిషనర్ వై.ఓబులేసు

UTF గూడూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో 2 వ విడత గా *40 గిరిజన కుటుంబాలకు నిత్యావసర  వస్తువుల పంపిణీ


*UTF సేవలు అభినందనీయం : కమిషనర్ వై.ఓబులేసు*


ఈరోజు (23-4-2020) ఆంద్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గూడూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో2 వ విడతగా నెల్లటూరు సమీపంలోని రాగి చెరువు కట్టను ఆనుకొని ఉన్న జనార్థన కాలనీ మరియు రిలయన్స్ పెట్రోల్ బంకు వెనుకవైపు గల 40 గిరిజన కుటుంబాలకు నెల రోజులకు సరిపడే 14 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం  గౌరవనీయులు మునిసిపల్  కమిషనర్ వై.ఓబులేసు మరియు జిల్లా UTF జిల్లా అధ్యక్షుడు యన్.నవకోటేశ్వరరావు చేతుల  మీదుగా పంపిణీ చేయడం జరిగింది . ఈ సందర్భంగా మునిసిపల్ కమిషనర్ గారు మాట్లాడుతూ ఈ లాక్ డౌన్ సమయంలో పనులకు వెళ్ళలేక ఆకలితో అలమటిస్తున్న నిరుపేద నిస్సహాయ కుటుంబాలను మరలా 2 వ విడతగా  గూడూరు పట్టణ శాఖ UTF ఉపాధ్యాయులు నిత్యావసర సరుకులు అందించి  ఆదుకోవడం స్పూర్తిదాయకమన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేదలు నివసించే కాలనీలలో 40 మంది గిరిజనులను ఆదుకున్నారన్నారు. దాతలు, యువత ముందుకొచ్చి నిరుపేదలను ఆదుకోవాలని ఆయన కోరారు. అలాగే ఈ సామాజిక సేవా కార్యక్రమానికి ఆర్ధిక సహాయం అందించిన CSM ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి N. పరంజ్యోతి మేడం గారిని అభినందించారు. జిల్లా అధ్యక్షులు N.నవకోటేశ్వరరావు మాట్లాడుతూ  యూటియఫ్ తరుపున నిరు పేదలను గుర్తించి వారికి సహాయం జిల్లా, రాష్ట్ర  వ్యాప్తంగా  జరుగుతుంది అని , UTF ఉపాధ్యాయులు కేవలం విద్య తోనే గాక, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సామాజిక సేవా కార్యక్రమాలు ద్వారా కూడా సహాయం  అందిస్తున్నామని తెలియజేసారు.ఈ గిరిజన కాలనీలో  కుటుంబాలకు  14 రకాల నిత్యావసర వస్తువులను అందించామన్నారు. ఈ కార్యక్రమంలో ZP BOYS ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రావూఫ్ గారు, ఉపాధ్యాయులు  వాసుదేవరావు, సుధీర్,బాలసుబ్రహ్మణ్యం,ప్రాణేష్ రావు , రామ చంద్ర రెడ్డి, A.శ్రీనివాసులు, నాగేశ్వరరావు ,చంద్రమోహన్, భగవాన్ బాబ్జి, I. శ్రీనివాసులు, జగదీష్ , అట్ల రవి, సచివాలయ సిబ్బంది ,వాలెంటీర్లు తదితరులు పాల్గొని సహాయ సహకారాలు అందించారు.


Popular posts
90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నెల్లూరు జిల్లాలో రెండవసారి మహాత్ముని పర్యటన
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
21వ శతాబ్దం మనదే...మోదీ
Image
బాలల దినోత్సవ సందర్భంగా    వాసవి క్లబ్    ఆధ్వర్యంలో.నోట్ బుక్స్ పంపిణీ..
Image
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*