బి.సి కాలనీ మిత్ర బృందంచే భోజనాల ప్యాకెట్లు పంపిణీ

బి.సి కాలనీ మిత్ర బృందంచే భోజనాల ప్యాకెట్లు పంపిణీ వింజమూరు: ఏప్రిల్ 16 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని బి.సి. కాలనీ మిత్ర బృందం సభ్యులు గురువారం నాడు స్థానిక ప్రభుత్వ పాఠశాల వద్ద వున్న సంచార జాతుల కుటుంబాలకు భోజనాల ప్యాకెట్లును పంపిణీ చేశారు. భోజనాల పంపిణీకి ముఖ్య అతిధిగా తహసిల్ధారు యం.వి.కే.సుధాకర్ రావును ఆహ్వానించారు. ఈ సందర్భంగా తహసిల్ధారు మాట్లాడుతూ తమ కార్యాలయంలో కంప్యూటర్ విభాగంలో పనిచేస్తున్న క్రిష్ణ నేతృత్వంలో పలువురు యువకులు బృందంగా ఏర్పడి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం తమకు గర్వ కారణంగా ఉందని కొనియాడారు. కరోనా వైరస్ విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు మే 3 వ తేదీ వరకు పొడిగించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు వింజమూరు మండలంలో స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, వివిధ రాజకీయ పక్షాల నేతలు విరివిగా కూరగాయలు, నిత్యావసరాలు, మాస్కులు, శానిటైజర్లు, భోజనాలు పంపిణీ చేస్తూ పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల ఆకలి దప్పులు తీర్చుతుండటం అభినందించదగిన విషయమన్నారు. తాజాగా యువకులు కూడా మిత్ర బృందాలుగా ఏర్పడి పేద ప్రజలకు సేవలందించడం ప్రశంసనీయమంటూ, అందరూ కూడా ఈ సేవా కార్యక్రమాలను లాక్ డౌన్ ముగిసే వరకు కొనసాగించాలంటూ దాతలందరికీ విజ్ఞప్తి చేస్తూ వారందరికీ తహసిల్ధారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిత్ర మండలి బృందం సభ్యులు ఇ.వెంకటరమణయ్య, పి.క్రిష్ణ, యం.మహేంద్ర, ఆర్.శ్రీహరి, యం.చిన హజరత్, కె.మహేష్, యం.పెద హజరత్, జి.సుబ్బారావు, పి.రాజశేఖర్, వి.ఆర్.ఏ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.