ఉచిత రేషన్ సరుకుల పంపిణీ లో పారదర్శకతపై దృష్టి : విశాఖ ఎం.పి.
విశాఖపట్నం ఏప్రిల్ 29 (అంతిమ తీర్పు) : లాక్ డౌన్ సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని
విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు MVV సత్యనారాయణ అన్నారు. ఈ క్రమంలో విశాఖపరిధి
అల్లిపురం, చలువతోటలో ప్రభుత్వ రేషన్ డిపోని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా మూడవ విడత ఉచిత రేషన్ సరుకుల పంపిణీ లో పారదర్శకతపై దృష్టిసారించామన్నారు.ఈ నేపథ్యంలో బియ్యం తదితరాల పంపిణీ పై లబ్దిదారులతో మాట్లాడి ,వివరాలు అడిగి తెలుసుకున్నామన్నారు.
జారీ-ఈరంకి శర్మ ,పీ ఆర్ ఓ
ఉచిత రేషన్ సరుకుల పంపిణీ లో పారదర్శకతపై దృష్టి : విశాఖ ఎం.పి.