మాస్కులు పంపిణీ చేసిన టిడిపి యువనాయకుడు దయాసాగర్

మాస్కులు పంపిణీ చేసిన టిడిపి యువనాయకుడు దయాసాగర్


ఎమ్మిగనూరు,టౌన్,ఏప్రిల్,13 (అంతిమతీర్పు):- కర్నూలు జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సామాజిక కార్యక్రమాల్లో భాగంగా  ఎమ్మిగనూరు తెలుగుదేశంపార్టీ  ఇంచార్జి మాజీ MLA బి.వి జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు  తన వంతు సహాయాన్ని  HBS కాలనీ,గీతనగర్, పరిధిలో పలు కాలనీలకు వెళ్లి  మాస్కులు పంపిణీ చేసినట్లు పట్టణ తెదేపాయువ  నాయకులు  దయాసాగర్ తెలిపారు.కరోనా  వైరస్  కారణంగా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ ను  మరింత పటిష్టం చేసే  క్రమంలో పట్టణ ప్రజలు,గ్రామీణ ప్రాంత ప్రజలు ఇళ్లలోనే ఉండి కరోనా వైరస్ ను అరికట్టే బాధ్యత మన దేశ ప్రజలపై ఉందని ఆయన కోరారు.