కరోనా వాహకాలుగా వైసీపీ నేతలు : కె.ఎస్.జవహర్


28.04.2020


కరోనా వాహకాలుగా వైసీపీ నేతలు
మోపిదేవి పదవి పోతుందనే ఫ్రెస్టేషన్ లో ఉన్నారు
వారంలో కేసులు రెట్టింపవ్వడానికి కారణమెవరు.?


-కె.ఎస్.జవహర్


రాష్ట్రంలో బాధ్యతగా మెలగాల్సిన మంత్రులే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. మంత్రి మోపిదేవి ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియడం లేదు. యథారాజా తధా ప్రజా అన్న రీతిలో మాట్లాడారే తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో మాట్లాడినట్లు లేదు. మండలి రద్దు అయితే మంత్రి పదవి పోతుందనే ఫ్రెస్టేషన్లో ఏదేదో ఏదేదో మాట్లాడుతూ ప్రజల్లో చులకన అవుతున్నారు.
 
శ్రీకాళహస్తి మాఢ వీధుల్లో దేవుని విగ్రహాన్ని ఊరేగించినట్లు 60 ట్రాక్టర్లతో ర్యాలీ చేయించిన బియ్యపు మధుసూధన్ రెడ్డి ఎవరు.? 50 కరోనా కేసులు నమోదు కావడానికి  కారణం ఎవరు.? గూడూరులో ట్రాక్టర్ ర్యాలీ చేసిందెవరు? కనిగిరి ఎమ్మెల్యే 30 వాహనాల్లో కర్నాటక నుండి ఏపీకి వచ్చి గందరగోళం సృష్టించినది ఎవరు.? లక్షతో బోరు వేయించి భౌతిక దూరం పాటించకుండా లక్ష విలువైన పూలు జల్లించుకున్నది ఎవరు.? విజయసాయి రెడ్డి శ్రీకాకుళం నుండి విజయనగరం, అమరావతి, హైదరాబాద్ మాట్లాడితే మోపిదేవి వెంకటరమణకు కనిపించలేదా.? ఇప్పుడు చెప్పండి కరోనా వాహకాలు ఎవరు.? కేంద్రం చేసిన సహాయాన్ని ప్రజలకు ఎంత పంచారు.? ఎంత దోచేశారో ప్రజలకు చెప్పరా.?


పదో తరగతి పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నది ఎవరు.? అసలు పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియని పరిస్థితికి కారణం ఎవరు.? తెలుగుదేశం పార్టీ నేతలు ఆహారం పంచుదామన్నా, సేవ చేద్దామన్నా నిబంధనల పరుతో అడ్డుకుంటున్నారు. వైసీపీ నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా తిరుగుతూ కరోనా వ్యాప్తికి కారణమైనది ఎవరు.?


మద్యం షాపుల్లో మద్యాన్ని ఎలుకలు తాగేశాయని చెప్పడానికి సిగ్గులేదా.? తాళం వేశాం.. గొళ్లెం మరచితిమి అన్నట్లు ఎక్సైజ్ అధికారులు వ్యవహరించడంతో అక్కడి మద్యం మొత్తం వైసీపీ నేతలు బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. సారాయి ఏరులై పారుతోందని స్పీకరే చెబుతున్నా పట్టించుకోరు. ఇసుక రీచుల్లో జరుగుతున్న దోపిడీ దేశమంతా చూస్తోంది. 
ఏప్రిల్ 12న ప్రధాన మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో దేశంలోని అందరు ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడిగించాలంటే.. మన ముఖ్యమంత్రి మాత్రం గ్రీన్ జోన్లు, మండలాల వారీగా సడలింపులు అంటూ 400 కేసుల్ని 1177 కేసులకు పెంచారు. దీని ద్వా ప్రజల ప్రాణాలపై ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి స్పష్టమైంది. ప్రభుత్వం కరోనా నియంత్రణలో విఫలమైంది. ఇంటెలిజెన్స్ పని చేయడం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు దద్దమ్మల్లా తయారయ్యారు. ముఖ్యమంత్రి ఏకంగా ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్ అంటారు. సహజీవనం చేయాలంటూ అర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నికలు జరపాలి, తమ వారికి పదవులు కట్టబెట్టాలి. తద్వారా జె ట్యాక్స్ వసూళ్లు పెంచుకోవాలన్నదే ధ్యేయంగా ఉంది తప్ప. ప్రజల ప్రాణాలు ఏమాత్రం పట్టడం లేదు.
ఎన్నికల కమిషనర్ కనగరాజ్ చెన్నై నుండి ఎలా వచ్చారు.? అతనికి క్వారంటైన్ పట్టదా.? రాష్ట్రంలోని పరిస్థితులపై ఫిర్యాదు చేయడానికి అతని అడ్రస్ కూడా తెలియని పరిస్థితి ఎందుకు వచ్చింది.? రాజ్ భవన్ సిబ్బందికి కరోనా సోకడానికి కారణం ఈ ఎన్నికల కమిషనర్ కాదా.? రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు దద్దమ్మలు కాబట్టే పాలన ఇంత దారుణంగా ఉంది. రాష్ట్రంలో నమోదైన కేసులకు గల కారణాలను విశ్లేషించిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. మీ పాలనపై ప్రజలకు క్లారిటీ వచ్చేసింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని ప్రజలు నువ్వే కావాలి అనుకునే పరిస్థితుల్ని 10 నెలల్లోనే తీసుకొచ్చారు.


Popular posts
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
బలోపేతానికి చారిత్రక ప్రణాళిక రూపొందించిన ఏపీ ప్రభుత్వం
Image