నిత్యం ప్రజలకు అండగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ::జియాఉల్ హఖ్

నిత్యం ప్రజలకు అండగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ::జియాఉల్ హఖ్
నెల్లూరు, సిటి, ఏప్రిల్, 12 ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్, అందులో రెడ్ జోన్, ఇంటి బయట వైరస్ సమస్య , ఇంటి లోపల ఆకలి సమస్య, ఎలా ఎలా పోరాడాలి రెండు సమస్యలతో, పోరాడాలని ఉంది కానీ బలం, లేదు ధైర్యం లేదు. అయినా ఇంట్లోనే ఉండి  సాహసం చెస్తున్న పేద ప్రజలకి మేమున్నా మంటూ కరోన అలాక్ డౌన్ ప్రకటించిన నాటి నుండి ఇంటర్నేషనల్హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు జియాఉల్ హఖ్ ముందుకు వచ్చారు. నెల్లూరు నగరములోని రెడ్ జోన్ ప్రాంతామైన 43 వ డివిజన్ నందు నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందిస్తున్నారు. ఆదివారం నగరములోని, జెండావీధి, బడేసావీధి, బొందిలివీధి, తదితర ప్రాంతాలలో బియ్యం, కందిపప్పు, నూనె, మినప్పప్పు,చక్కర, తదితర నిత్యావసర సరుకులను ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ వంతు సహాయం చేయాలని పేద ప్రజలకి అవసరమైన నిత్య అవసరమైన వస్తువులు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమములో  ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులు ముజాహిద్, జవాద్ ఖాన్, అప్సర్, యూనుస్,  నౌషాద్, జమీర్, హఫీజ్, తదితరులు పాల్గొన్నారు.