విజయసాయిరెడ్డికి లాక్ డౌన్ వర్తించదా

12.04.2020
బెందాలం అశోక్ బాబు మీడియా సమావేశం వివరాలు
విజయసాయిరెడ్డికి లాక్ డౌన్ వర్తించదా?
ప్రతి కుటుంబానికి రూ.5వేలు ఇవ్వాలి
- శ్రీ బెందాలం అశోక్ బాబు ఎమ్మెల్యే


గత రెండు నెలలుగా ప్రపంచదేశాలు, అమెరికా వంటి దేశాలు కూడా కరోనా మహమ్మారిని అరికట్టడంలో విఫలమైన తరుణంలో మన రాష్ట్రం తీసుకున్న చర్యలు అక్షేపనియమైనని టీడీపీ ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబు అన్నారు. కరోనా విషయంలో పక్క రాష్ట్ర్టాలతో పోల్చిస్తే మన రాష్ట్రంలో చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. మొదటి ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్లీసింగ్ పౌడర్, పారసిటమాల్ అని హేళనగా మాట్లాడారు.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మన మంత్రి వర్గంలో ఉన్న కొంత మంది నాయకులతో బూతులు తిట్టిస్తారు. కరోనాకు సంబంధించిన మాస్క్ లు, మందులు గ్రౌండ్ లెవల్ చేరుతున్నాయని ముఖ్యమంత్రి ఒక్కసారైనా పరిశీలించారా? అలాగే నర్సిపట్నంలో ఒక డాక్టర్ మాస్క్లు లేవని అన్నందుకు సప్పెండ్ చేశారు. కమిషన్ కూడా సప్పెండ్ చేశారు. అలాగే ఎన్నికలు వాయిదా వేసినందుకు రమేష్ కుమార్ ను సప్పెండ్ చేశారు..దీని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి కరోనా పై పోరాటం చేస్తున్నారా? లేక వ్యవస్థలపై పోరాటం చేస్తున్నారా? అనే అర్ధమౌతోందన్నారు. ప్రధాని మోడీతో జరిగిన వీడియో కాన్ఫెనన్స్ లో మా రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉందని తరువాత మా రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగించాల్సిన అవసరం లేదని చెప్పారు. అంటే మీరు ఏరకమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. కేవలం ఎన్నికలు జరపాలనే తప్పా ప్రజల ఆరోగ్య పట్ల అలోచన లేదన్నారు. గతంలో తిల్లీ తుఫాన్ వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు తొమ్మిదిరోజులు బస్సులోనే ఉండి ఆ ప్రాంతానికి కరెంట్ ఇచ్చిన సంధర్భం మనం చూశామని అన్నారు.  ఆ రోజు పక్కనే ఉన్న విజయనగరం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి  ఉండి కూడా రాలేదు. ఆ రోజులు మీరు ఏమి మాట్లాడారో గుర్తు చేసుకోవాలన్నారు. జాతీయ విపత్తుకు, ఆరోగ్య అత్యవసర మధ్య తేడా తెలియని పరిస్థితిలో అధికార పార్టీ ఉందన్నారు. కరోనా నియంత్రణ కోసం అధికారులు చాలా కష్టపడుతున్నారు. కానీ ప్రభుత్వం వారికి ఎటువంటి సహాయం చేయడం లేదు. టెస్టింగ్ కిట్లు  మన రాష్ట్రంలో ఉన్నాయా?  చంద్రబాబునాయుడు హైదరాబాద్ నుంచి వస్తే 14 రోజలు క్వారైంటైన్ కు వెళ్లాలని అంటున్నారు. మరి విజయసాయిరెడ్డికి లాక్ డౌన్ వర్తించందా? ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు మరి ప్రజలకు ఏమి చేశారు. కేవలం రంగు వేయడానికి మాత్రమే సమయం అంత కేటాయించారు. ఇదే సమయంలో చంద్రబాబునాయుడు ఉండే బాగుండేదని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. కరోనా పరిస్థితిలో కూడా వైసీపీ నాయకులు రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కరోనా సమయంలో రైతుల పరిస్థితులు ఎలా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయాలకు అతీతంగా సేవ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడి హోదా ఉన్నట్లు మాట్లాడుతున్నారని అన్నారు.  ఇలాంటి సమయంలో ఎలక్షన్ కమిషన్ మార్చాల్సిన అవసరం లేదు.. కానీ ఆయను మార్చిస్తేనే కరోనా పోయిందనట్లు వెంటనే మార్చారని అన్నారు. మంచి మనస్సుతో ప్రజల కోసం బాధ్యతయుతంగా వ్యహారించాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి రూ. వెయ్యి ఇచ్చారు. మరి ఇప్పటి పరిస్థితిలో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి కుటుంబానికి రూ.5వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.