దాహార్తి ని తీర్చేందుకు కృషి చేస్తున్న 'పాలకొలను  వరికుంటపాడు 

దాహార్తి ని తీర్చేందుకు కృషి చేస్తున్న 'పాలకొలను 
వరికుంటపాడు ,:
ఎలాంటి లాభాపేక్ష లేకుండా సొంత నిధులతో విరువూరు పంచాయతీ లో దాహార్తి ని తీరుస్తున్న పాలకొలను భాస్కర్ రెడ్డి దాతృత్వం ఇది. వరికుంటపాడు మండలం విరువూరు పంచాయతీ తూర్పు పాలెం కి చెందిన భాస్కర్ రెడ్డి వృత్తి రీత్యా ఇతర ప్రాంతాల్లో కాంట్రాక్టు పనులు చేసుకుంటున్నారు. తమ ప్రాంతాల్లో నీటి ఎద్దడి ని గుర్తించిన ఆయన తూర్పు పాలెం లో రెండు బోరులను వేయించాడు. నీరు పడక పోవడం తో నిరాశ చెందకుండా విరువూరు లో ఒక బోరు ని వేయించాడు  అందులో పుష్కలం గా నీరు పడటం తో రెట్టించిన ఉత్సాహం తో ఇదే పంచాయతీ పరిది లోని కోటవర్ధి పల్లి లో మరో బోరు ని వేయించాడు. అందులో కూడా నీరు సమృద్ధి గా రావడం తో ఆ గ్రామ ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అడుగంటిన భూగర్భ జలాలతో గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్న జనం భాస్కర్ రెడ్డి సేవాగుణం వల్ల ఎంతో మేలు జరిగింది అని ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు.