ఉద్యమం లా పారిశుధ్య పనులు

ఉద్యమం లా పారిశుధ్య పనులుko
వరికుంటపాడు ;
వరికుంటపాడు మండలం లోని పలు గ్రామాల్లో పారిశుధ్య పనులు ఉద్యమం లా చేపట్టారు. ఎంపీడీఓ సురేష్ బాబు నేతృత్వం లో ఇస్కపల్లి, నల్లబోతులవారిపల్లి కాలనీ, కాంచెరువు, గువ్వడి గ్రామాల్లో హైడ్రోక్లోరిడ్ ద్రావణం పిచికారీ చేపట్టారు. వీధుల వెంబడి మురికి గుంటలు లేకుండా చేసి, పేడ దిబ్బల వద్ద,  మురికి నీరు నిల్వల వద్ద హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేసి బ్లీచింగ్ చల్లారు. కాంచెరువు గ్రామం లో ప్రజలతో ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామం లొకి ఎవరు కొత్త వ్యక్తులు రాకుండా చూడాలని, ఎవరైన వస్తే సమాచారం అందించాలన్నారు. అలాగే రేషన్ షాప్ ల్లో సామజిక దూరం పాటించాలన్నారు. అనంతరం ఎన్ బి కాలనీ, గువ్వడి లలో రేషన్ పంపిణి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆయన తో బాటు ప్రత్యేక అధికారిని వసంత కుమారి, పంచాయతీ సెక్రటరీ శివకుమార్, వాలంటీర్స్ పాల్గొన్నారు.