తెలంగాణాలో స్థానిక పత్రికలు నిలదొక్కుకునే పరిస్థితి నాడూ లేదు, నేడూ లేదు: దేవరకొండ కాళిదాస్‌ ‌సీనియర్‌ ‌జర్నలిస్టు

తెలంగాణాలో స్థానిక పత్రికలు నిలదొక్కుకునే పరిస్థితి నాడూ లేదు, నేడూ లేదు అని దేవరకొండ కాళిదాస్‌
‌సీనియర్‌ ‌జర్నలిస్టు .మూడున్నర దశాబ్దాల పాటు జర్నలిస్టుగా ఎందరో సీఎంలను, మరెందరో ఐఏఎస్‌లను చూశాను. సగటు జర్నలిస్టు జీవితం కరివేపాకును పోలిందే తప్ప, స్థిరత్వాన్ని పొందలేక పోయింది. నిన్నటి వరకు వివక్ష, ప్రస్తుతం నిర్లక్ష్యం. తెలంగాణాలో స్థానిక పత్రికలు నిలదొక్కుకునే పరిస్థితి నాడూ లేదు, నేడూ లేదు. జిల్లాల్లో మండల స్థాయి కలం కార్మికులు, వలస కూలీలకన్నా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. హక్కులు గాలిలో కలిసిపోయాయి. వైట్‌ ‌కాలర్‌ ఉద్యోగమంటూ దిన దిన గండంగా కాలం వెల్లదీయాల్సి వస్తోంది. ఆంధ్రా పత్రికలతో బంగారు తెలంగాణ సాధ్యమా? అంటూ పక్కింటి వాడికి పాయసం వండి పెట్టినా కడుపు నిండాక వాళ్లింటికే వెళ్లి పోతాడన్న వాస్తవాన్ని మన ప్రభుత్వానికి చాలాసార్లు చెప్పాలనుకున్నాను. వినే పరిస్థితిలో లేదు. అన్ని రంగాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామంటున్న స్వరాష్ట్ర నేతలు జర్నలిస్టులను ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కావడం లేదు. నివురు గప్పిన నిప్పులా వున్న స్థానిక జర్నలిస్ట్ లు కలాలను తిరగేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించనిది కాదు. ఉమ్మడి ప్రభుత్వం జారీ చేసిన జీవోలపైనే ఆధారపడుతున్న స్వరాష్ట్రం తెచ్చిన ఒకే ఒక్క జీవో 239 స్థానిక జర్నలిస్టుల నడ్డి విరిచింది. పూటగడవడం కోసం జర్నలిస్టులు దిక్కుతోచక బిక్కుబిక్కు మంటున్నారు.
ఈ అంశాలపై మొదటిసారిగా జీవో వచ్చిన నేపథ్యం, అవి ఎవరి కోసమొచ్చాయో తెరవెనుక బాగోతాలు సమగ్రంగా చర్చించేందుకు గురువారం (తేది : 30/04/2020) ఉదయం 12గంటలకు ఫేస్‌ ‌బుక్‌ ‌లైవ్‌లో ఉంటాను. రండి... ఆవేదన పంచుకుందాం అన్నారు దేవరకొండ కాళిదాస్‌
‌సీనియర్‌ ‌జర్నలిస్టు.