జనతా బజార్లపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష

*24–04–2020*
*అమరావతి*


జనతా బజార్లపై క్యాంపు కార్యాలయంలో సీఎం .  వైయస్‌.జగన్‌ సమీక్ష


*అమరావతి:* 
జనతా బజార్ల విధివిధానాలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష
జనతా బజార్ల నిర్వహణ, విధివిధానాలపై సమీక్ష లో
అధికారుల ప్రతిపాదనలపై చర్చ
జనతాబజార్లలో ఆక్వా ఉత్పత్తులను విక్రయించేలా చూడాలి: సీఎం
గ్రేడింగ్, ప్యాకింగ్‌ దశ కూడా గ్రామస్థాయిలోకి తీసుకెళ్లాలి:
రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు తగిన స్థాయిలో మార్కెట్‌ ఈ బజార్ల ద్వారా మార్కెటింగ్‌ అవకాశాలు లభించాలి:
కరోనా నేపథ్యంలో వికేంద్రీకరించిన బజార్లను భవిష్యత్తులోనూ కొనసాగేలా చూడాలి:
రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులను ఇక్కడ విక్రయించేలా చూడాలి:
దీనివల్ల రైతులకు, వినియోగదారులకు మేలు జరుగుతుంది:
దీనివల్ల మార్కెట్లో పోటీ పెరుగుతుందని, తద్వారా రైతులకు మేలు జరుగుతుందన్న సీఎం
మార్కెట్లో ఉత్పత్తులు నిలవాలంటే.. గ్రేడింగ్, ప్యాకింగ్‌ బాగుండాలి:
కనీసం 20–25 ఉత్పత్తులు అందేలా చూడాలి:
సమావేశంలో చర్చించిన అంశాలతో విధివిధానాలు తయారుచేయాలని సీఎం ఆదేశం
మరింత మేథోమథనం చేసి మంచి ప్రతిపాదనలతో రావాలన్న సీఎం
వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, అగ్రికల్చర్‌ మిషన్‌  వైస్‌ ఛైర్మన్‌ నాగిరెడ్డి సహా అధికారులు హాజరు.