ఆంధ్రప్రదేశ్ఏపీ సచివాలయంలో అటెండర్‌కు కరోనా పాజిటివ్
అమరావతి: ఏపీ సచివాలయంలో కీలక శాఖలో పనిచేస్తున్న అటెండర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఎవరికీ చెప్పకుండా అటెండర్ ఎటో వెళ్లిపోయారు. చిరునామా తప్పుగా ఇవ్వటంతో అటెండర్ కోసం వైద్య సిబ్బంది 2 గంటలపాటు వెతికారు. చివరకు ఆచూకీ తెలుసుకుని ఐసోలేషన్‌కు తరలించారు. అటెండర్‌కు పాజిటివ్ రావడంతో కీలక శాఖ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
అటు ఆస్పత్రి వర్గాల్లోనూ, ఇటు సచివాలయం వర్గాల్లోనూ గందరగోళం చెలరేగడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యక్తి మంత్రి వద్ద పీఏగా ఉన్నాడని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే ఇది పూర్తిగా అవాస్తమని, సచివాలంలో కేవలం అటెండర్‌గా పనిచేస్తున్నారని ఆ మంత్రి పేషీ వర్గాలు స్పష్టం చేసింది. గత పదిహేను రోజుల నుంచి ఇతని కాంటాక్ట్స్‌ను సేకరిస్తున్నారు