పలు జిల్లాల్లో వరుణుడి బీభత్సం

పలు జిల్లాల్లో వరుణుడి బీభత్సం
అమరావతి: రాష్ట వ్యాప్తంగా గురువారం తెల్లవారుజామున పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుముల మెరుపులతో కూడిన వడగండ్ల వానతో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. కృష్ణా జిల్లా కురవటంతో కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాలు చిగురుటాకులా వణికాయి. దీంతో మామిడి ,కొబ్బరి చెట్లు విద్యుత్ స్తంభాలు, పూరి గుడిసెలు నేలకొరిగాయి. కృత్తివెన్ను పల్లెపాలెంలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లిన ఇద్దరు జాలర్లు గల్లంతయ్యారు. ఒకరు మృతి చెందారు. నిడమరు పంచాయతీలో మరో ఐదుగురు మత్స్యకారులు గల్లంతవటంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అకాల వర్షం తమ పాలిట శాపంగా మారిందని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని కైకలూరు, కలిదిండి,  మండవల్లి, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్,  గుడివాడతో పాటు పలు ప్రాంతాల్లోలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
ప్రకాశం: పర్చూరు ప్రాంతంలో చిరుజల్లులు కురవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా  మిర్చి రైతులు, మిర్చిని పరదాలతో కాపాడుకోటానికి పాట్లు పడ్డారు.
పశ్చిమ గోదావరి: జంగారెడ్డిగూడెం మండలంలో తెల్లవారుజామున ఉరుములతో కూడిన గాలి, వాన బీభత్సం సృష్టించింది. దీంతో మండలంలో పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా మామిడి కాయలు నెలరాలాయి.  మొక్కజొన్న, వరి పంటలు తడిసిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
గుంటూరు: జిల్లాలో పలు చోట్ల చెదరుమదరుగా వర్షం కురిసింది. పొన్నూరు, రేపల్లె, బాపట్ల, చిలకలూరిపేటలో మోస్తరు వర్షం పడింది. పొన్నూరు మండలం కొండముదిలో పిడుగుపడి రెండున్నర ఎకరాల వరికుప్ప దగ్ధం అయింది.
తూర్పు గోదావరి: జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గంలో వేకువజాము నుంచే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అదేవిధంగా రాజనగరం నియోజకవర్గం మూడు మండలాల్లో గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ఉపయోగించి రైతులు మొక్కజొన్న, ధాన్యాన్నివర్షం నుంచి కాపాడుకోవడానికి  ప్రయత్నం చేశారు.


Popular posts
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
అల్లుకుపోతున్న ట్రాన్స్ కో నిర్లక్ష్యం...
Image
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
విలేకరిపై దౌర్జన్యం చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోండి :మీడియా ప్రతినిధులు 
Image
హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు