నిధులను కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు- యనమల రామకృష్ణుడు 

అమరావతి, ఏప్రిల్ 22 (అంతిమ తీర్పు ):
యనమల రామకృష్ణుడు విలేకరుల సమావేశం వివరాలు
జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరోనా తీవ్రరూపం దాలుస్తోంది- అవినీతి, రాజకీయాలకే వైసీపీ ప్రాధాన్యత- నిధులను కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు- యనమల రామకృష్ణుడు 
         దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలన్ని కరోనా తీవ్రతను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటుంటే.. జగన్మోహన్ రెడ్డి మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా అంటే జగన్ కు మొదటి నుంచి చులకన. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనే దుర్బుద్ధితోనే.. కరోనాను తీవ్ర నిర్లక్ష్యం చేశారు. నేడు కరోనా నియంత్రణ విషయంలో ఏపీ వెనుకబడి ఉంది. పరీక్షలు ఎక్కువగా నిర్వహించడం లేదు. ర్యాపిట్ కిట్లలో కూడా అవినీతికి పాల్పడే స్థితికి వచ్చారు. అవినీతికి, రాజకీయాలకే ప్రాధాన్యత తప్పితే.. కరోనా నియంత్రణ విషయంలో లేదు. దీనిని ప్రతిఒక్కరు ఖండించాలి. కర్ణాటక, కేరళ కరోనాను సమర్థంగా అరికడుతున్నాయి. కేరళ మొదటి స్థానంలో ఉంది. ఏపీ ఎందుకు అరికట్టలేకపోయిందో మనం ఆలోచన చేసుకోవాలి. జగన్ నిర్లక్ష్యం, వైఫల్యం వల్ల కోరనా రోజురోజుకూ పెరుగుతోంది. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. మరోవైపు రాష్ట్ర ఆదాయం కూడా లేదు అనడానికి లేదు. కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. పెన్షన్లు, జీతాల్లో కోత విధించారు. నిధులన్నీ కాంట్రాక్టర్లకు ఇస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రద్దుల విధానంలోనే జగన్ వెళుతున్నారు. ఇప్పటికీ మేల్కోవడం లేదు. పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. పంటలను కొనే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఖరీఫ్ కు పెట్టుబడులు పెట్టలేరు. దీంతో ఆహర కొరత కూడా సంభవిస్తుంది. పేదలను ఆదుకునేందుకు ఏ విధమైన ఆర్థిక ప్యాకేజీ ప్రకటించలేదు. కరోనా కేసులను దాచిపెడుతున్నారు. ఎన్ని టెస్ట్ లు చేస్తున్నారో చెప్పడం లేదు. ప్రజలకు నిజాలు తెలియనివ్వడం లేదు. ర్యాపిడ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. అధికార పార్టీకి రాజకీయాలే ముఖ్యమన్న ధోరణిలో ఉన్నారు. వైసీపీ నేతలే కరోనాను వ్యాపింపచేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలి.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...
Image
87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌
Image
సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు
భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు
Image