ఐసోలేష‌న్ వార్డులుగా మారిన రైల్వే కోచ్‌లు.

ఐసోలేష‌న్ వార్డులుగా మారిన రైల్వే కోచ్‌లు...
* కోవిడ్‌-19 నియంత్ర‌ణ‌కు ద‌.మ రైల్వే ప్ర‌త్యేక చ‌ర్య‌లు 
* రైల్వేబోర్డు సూచించిన లక్ష్యానికి అనుగుణంగా 486 రైలు కోచ్‌లు మార్పు 
* అత్యంత క్లిష్ట స‌మ‌యంలోనూ ప్ర‌యాణికుల ఆరోగ్య‌భ‌ద్ర‌త‌కు ద‌.మ రైల్వే పెద్ద‌పీట‌
విజ‌య‌వాడ‌, .    కోవిడ్-19తో జరిగే పోరాటంలో జాతి ప్రయత్నాలకు దోహదంగా క‌రోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశలో భారతీయ రైల్వే బహుముఖ వ్యూహాలను అమలుచేస్తూ ముందడుగు వేస్తుంది. ఈ ప్రయత్నాలలో భాగంగా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా ఐదు వేల నాన్ ఏసి ప్రయాణికుల కోచ్‌ల‌ను ఐసోలేషన్ వార్డులుగా మార్చాల‌ని అన్ని రైల్వే జోన్‌ల‌కు సూచించింది. ఈ క్ర‌మంలో 5000 నాన్ ఏసి కోచ్‌ల సంఖ్యలో దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క లక్ష్యంగా 486 కోచ్‌లు తయారు చేయాలని రైల్వే బోర్డు సూచించింది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ఆదేశాల మేర‌కు అధికారులు, సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. నిర్దేశించిన లక్ష్యంలోగా ఆయా కోచ్‌ల‌ను ఐసోలేష‌న్ వార్డులుగా మార్చాల‌ని సంకల్పించారు. చేపట్టిన కార్యాన్ని త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేసేందుకు కావాల్సిన వస్తు సామాగ్రిని కొనుగోలు చేయాల‌ని లాలాగూడ మరియు తిరుపతి వర్క్‌షాప్‌ల‌కు సూచిస్తూ జోన్‌లోని 6 డివిజన్లు, 2 వర్క్‌షాప్‌లు ఈ కార్యభారాన్ని పంచుకోవాలని ఆదేశించారు. అదుకు అనుగుణంగా సికింద్రాబాద్ డివిజన్ ప‌రిధిలో 120 కోచ్‌లు, హైదరాబాద్ డివిజన్ ప‌రిధిలో 40 కోచ్‌లు, విజయవాడ డివిజన్ ప‌రిధిలో 50 కోచ్‌లు, గుంతకల్లు డివిజన్ ప‌రిధిలో 61 కోచ్‌లు, నాందేడ్ డివిజన్ ప‌రిధిలో 30 కోచ్‌లు, గుంటూరు డివిజన్ ప‌రిధిలో 25 కోచ్‌లు చొప్పున లాలాగూడ‌ వర్క్‌షాప్‌లో 76 కోచ్‌లు, తిరుపతి వర్క్‌షాప్‌లో 84 కోచ్‌ల‌ను ఐసోలేషన్ వార్డులుగా మార్పు చేశారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా దక్షిణ మధ్య రైల్వే రంగంలోకి దిగ‌డంతో పాటు శాఖాప‌రంగా సూచించిన లక్ష్యంలోగా అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని 486 కోచ్‌ల‌ను ఐసోలేషన్ వార్డులుగా మార్పు చేసింది. ప్రతి ఐసోలేషన్ వార్డులో క‌రోనా  బాధితుల కోసం 8 కూపేలు మరియు వైద్య సిబ్బంది కోసం ఒక కూపే ఉంటాయి. రైల్వే బోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని కోచ్‌ల‌లో స్నానాల గది, 3 టాయిలెట్లు, కూపేల మధ్య తెరలు, అవసరమైన ఎలక్ట్రిక్ మరియు వైద్య పరికరాలు కూడా అమర్చారు. ఆయా కోచ్‌ల‌ను ఐసోలేషన్ వార్డులుగా నిర్దేశించిన లక్ష్యంలోగా రూపొందించ‌డంలో కృషిచేసిన అధికారులు, సిబ్బందిని ముఖ్యంగా మెకానికల్ విభాగాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ప్ర‌త్యేకంగా అభినందించారు.


Popular posts
90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నెల్లూరు జిల్లాలో రెండవసారి మహాత్ముని పర్యటన
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
21వ శతాబ్దం మనదే...మోదీ
Image
బాలల దినోత్సవ సందర్భంగా    వాసవి క్లబ్    ఆధ్వర్యంలో.నోట్ బుక్స్ పంపిణీ..
Image
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*